SOURCES SAYS SERIAL SHOOTING WILL STOP ONCE MORE AFTER TESTED ONE SERIAL ARTIST CORONA POSITIVE PK
సీరియల్ షూటింగ్స్ అన్నీ మూన్నాళ్ల ముచ్చటేనా..?
ప్రతీకాత్మక చిత్రం
Serial shootings: కరోనా వైరస్ కారణంగా గత మూడు నెలలుగా ఇండస్ట్రీతో పాటు టీవీ రంగం కూడా మూత పడిపోయింది. ఎలాంటి షూటింగ్‌లు లేకుండా అంతా ఇంటికే పరిమితం అయిపోయారు.
కరోనా వైరస్ కారణంగా గత మూడు నెలలుగా ఇండస్ట్రీతో పాటు టీవీ రంగం కూడా మూత పడిపోయింది. ఎలాంటి షూటింగ్‌లు లేకుండా అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. లాక్డౌన్ దెబ్బతో కోట్లాది రూపాయలు నష్ట్టం వచ్చింది కూడా. పని లేక పాపం చాలా మంది సినీ కార్మికులు, కళాకారులు పూట గడవని పరిస్థితికి వచ్చారు. అలాంటి వాళ్లందరికీ తీపి కబురు చెప్తూ ఈ మధ్యే మళ్లీ షూటింగ్స్ చేసుకోండి అంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. గత వారం రోజులుగా అన్నిచోట్లా కూడా సీరియల్ షూటింగ్స్‌తో పాటు రియాలిటీ షోలు కూడా బాగానే జరుగుతున్నాయి.
ఆర్ఎఫ్సీలో మొదలైన షూటింగ్ సందడి (serial shooting in rfc)
కోవిడ్ నిబంధనల ప్రకారమే ఆర్ఎఫ్సీతో పాటు హైదరాబాద్‌లోని పలు స్టూడియోస్‌లో ఈ సీరియల్ షూటింగ్స్ జరుగుతున్నాయి. అయితే ఉన్నట్లుండి ఇప్పుడు ఓ సీరియల్లో నటిస్తున్న ప్రభాకర్ అనే వ్యక్తికి సెట్లోకి వెళ్లాక కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఒక్కసారిగా అంతా షాక్ అయిపోయారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా సీరియల్ నటుడికి రావడంతో మళ్లీ షూటింగ్స్ అన్నీ క్లోజ్ చేసారు. అప్పటికప్పుడు అందర్నీ శానిటైజ్ చేసి ఇంటికి పంపించేసారు. ఈ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మరోసారి ఆలోచనలో పడిపోయినట్లు తెలుస్తుంది.
ప్రతీకాత్మక చిత్రం Photo : Twitter
ఇప్పటికే తమిళనాడులో సీరియల్ షూటింగ్స్ ఆపేయాలంటూ ఆజ్ఞలు వచ్చాయి. ఇప్పుడు మన దగ్గర కూడా ఇదే జరగబోతుందేమో అనే వార్తలు కూడా వస్తున్నాయి. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రభాకర్ ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యాడనేది ఇప్పుడు టెన్షన్ పెడుతున్న విషయం. వాళ్లే స్వచ్ఛందంగా వచ్చి టెస్టులు చేయించుకోవాలని టీం కోరుతుంది.
షూటింగ్స్‌కు మరోసారి బ్రేకులు (Shootings break in Tamil Nadu)
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ కోవిడ్ 19ను ఆపడం అంత ఈజీ కాదని అర్థమైపోయింది. అందుకే మళ్ళీ షూటింగ్స్ ఆగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు సినిమా షూటింగ్స్ అయితే జరగడం లేదు. హీరోలు ఇప్పట్లో బయటికి రావడానికి కూడా ఆలోచిస్తున్నారు. మొత్తానికి కరోనా విళయ తాండవం ఇలాగే సాగితే పరిస్థితులు రానురాను ఎలా ఉంటాయో ఊహించుకోడానికి కూడా భయంగానే ఉంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.