కరోనా పాజిటివ్.. ఒకప్పుడు ఈ మాట వింటే చాలా మంది భయపడేవాళ్లు.. వణికిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు కరోనాను పట్టించుకోవడం మానేసారు. మన నాయకులు చెప్పినట్లు అందరూ ఇప్పుడు కరోనాతోనే సహజీవనం చేస్తున్నారు. రోజుకు వేలల్లో కేసులు వస్తున్నాయి. అదేస్థాయిలో రికవరీ కూడా అవుతున్నారు. దాంతో కరోనా వచ్చిందంటే కూడా పట్టించుకోవడం మానేసారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మందికి కరోనా వచ్చింది.. తగ్గిపోయింది. లాక్డౌన్లో సీరియన్ నటులు నవ్యస్వామి, రవికృష్ణ , భరత్వాజ్, హరికృష్ణ లాంటి వాళ్లు కరోనా బారిన పడ్డారు.. అంతా క్షేమంగా బయటపడ్డారు కూడా. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో కూడా తమన్నా, బండ్ల గణేష్, రాజమౌళి, దానయ్య లాంటి వాళ్లు కరోనా బారిన పడి బయటపడ్డారు. అయితే కరోనాను మరీ అంత తక్కువ అంచనా కూడా వేయలేం.. ఎందుకంటే ఎస్పీ బాలసుబ్రమణ్యం లాంటి లెజెండ్‌ను మనకు దూరం కూడా చేసింది ఈ మాయదారి రోగమే అని అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ కూడా కరోనా బారిన పడ్డాడని తెలుస్తుంది.
అక్టోబర్ 18న అతడికి కరోనా పాజిటివ్ అని రిపోర్టులు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. దాంతో ప్రస్తుతం ఈయన హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయాడు. వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఈ విషయంపై సుధీర్ టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు సుధీర్‌కు కరోనా అనే వార్త తెలియగానే అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. ఒకవేళ సుధీర్‌కు కరోనా పాజిటివ్ అని తెలిస్తే ఆయనతో పాటే ఉండే మిగిలిన ఇద్దరి పరిస్థితేంటి.. అంటే రామ్ ప్రసాద్, శ్రీను అని దాని అర్థం. రష్మి గౌతమ్ కూడా ఎలా ఉందనే విషయంపై క్లారిటీ రావాలి.
ఎందుకంటే ఈ బ్యాచ్ అంతా కలిసే ఈ మధ్య అన్ని షూటింగ్స్ చేసారు. పైగా మొన్నటికి మొన్న దసరా స్పెషల్ ఈవెంట్ 'అక్కా ఎవడే అతగాడు'లో రష్మీ, వర్షిణి, సంగీత, శేఖర్ మాస్టర్ అంతా కలిసి షూటింగ్ చేసారు. దాంతో అంతా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని జబర్దస్త్‌తో పాటు అన్ని షూటింగ్స్ చేస్తున్నాడు సుధీర్. ఆయనతో పాటే మిగిలిన వాళ్లు కూడా వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షోకు కూడా కరోనా అంటుకుంటే పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sudigali sudheer, Telugu Cinema, Tollywood