పూరీ జగన్నాథ్ చేతిలో మోక్షజ్ఞ.. మాస్ కా బాప్ కథ రెడీ..?

Nandamuri Mokshagna: ఒక‌టి రెండు కాదు.. 15 ఏళ్ళైపోయింది నంద‌మూరి కుటుంబం నుంచి కొత్త హీరో వ‌చ్చి. ఇప్ప‌టికీ అదే క‌ళ్యాణ్ రామ్.. అదే ఎన్టీఆర్.. అదే బాల‌య్య ఇండ‌స్ట్రీని దున్నేస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 7, 2020, 3:50 PM IST
పూరీ జగన్నాథ్ చేతిలో మోక్షజ్ఞ.. మాస్ కా బాప్ కథ రెడీ..?
మోక్షజ్ఞ పూరీ జగన్నాథ్ (Mokshagna Puri Jagannadh)
  • Share this:
ఒక‌టి రెండు కాదు.. 15 ఏళ్ళైపోయింది నంద‌మూరి కుటుంబం నుంచి కొత్త హీరో వ‌చ్చి. ఇప్ప‌టికీ అదే క‌ళ్యాణ్ రామ్.. అదే ఎన్టీఆర్.. అదే బాల‌య్య ఇండ‌స్ట్రీని దున్నేస్తున్నారు. వాళ్లు కాకుండా ఈ కుటుంబం నుంచి కొత్త మొహాలు రాలేదు. మ‌రోవైపు అంద‌రి కుటుంబాల నుంచి వార‌సులు ఒక్కొక్క‌రుగా వ‌స్తూనే ఉన్నారు. గ‌త ప‌దేళ్ల‌లో వెల్లువ‌లా ఒక్కో ఫ్యామిలీ నుంచి ముగ్గురు న‌లుగురు వార‌సులు కూడా వ‌చ్చారు. మెగా ఫ్యామిలీ అయితే త‌మ కుర్రాళ్ల‌తో ఇండ‌స్ట్రీని నింపేసింది. దాంతో ఇప్పుడు నంద‌మూరి కుటుంబం మాత్ర‌మే బ్యాలెన్స్ ఉండిపోయింది.

Puri Jagannath going to direct Mokshagna Debut movie.. అవునా.. ఇదెక్కడి ట్విస్ట్..? అసలు అవకాశాలే లేని పూరీ జగన్నాథ్‌ను ఇప్పుడు బాలయ్య అయినా ఎలా నమ్ముతున్నాడు..? అసలు ఇది నిజమేనా..? పూరీ జగన్నాథ్ చేతిలో వారసున్ని పెడితే నందమూరి అభిమానులు ఊరుకుంటారా...? అసలు ఏ నమ్మకంతో పూరీ వైపు బాలయ్య చూస్తున్నాడు..? ఒక్క వార్త రాగానే ఇప్పుడు మోక్షు ఎంట్రీపై చాలా గాసిప్స్ వినిపిస్తున్నాయి. mokshagna entry,mokshagna puri jagannath,puri jagannath balakrishna,puri jagannath chirutha,puri mokshagna,mokshagna nandamuri,balakrishna mokshagna,పూరీ చేతిలో నందమూరి మోక్షజ్ఞ,మోక్షజ్ఞ పూరీ జగన్నాథ్,మోక్షజ్ఞ బాలకృష్ణ,మోక్షజ్ఞ పూరీ,పూరీ జగన్నాథ్ చిరుత,పూరీ జగన్నాథ్ పైసావసూల్ బాలయ్య,
మోక్షజ్ఞ పూరీ జగన్నాథ్

ఈ లోటు భ‌ర్తీ కావాలి అంటే ఇప్పుడు ఈ కుటుంబం నుంచి రావాల్సిన వార‌సుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ స‌న్ ఆఫ్ నంద‌మూరి బాల‌కృష్ణ‌. తండ్రికి త‌గ్గ త‌న‌యుడు.. తాత‌కు తగ్గ మ‌న‌వ‌డు అనిపించుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు ఈ కుర్రాడు. ఈ మ‌ధ్యే 22వ ఏట అడుగుపెట్టాడు మోక్షు. ఇండ‌స్ట్రీలో చాలామంది వార‌సులు ఇదే వ‌య‌సులోనే హీరోలుగా వ‌చ్చారు. చ‌ర‌ణ్ 21 ఏళ్ల‌కు "చిరుత‌".. అఖిల్ 20 ఏళ్ల‌కే "అఖిల్".. ఎన్టీఆర్ అయితే 16 ఏళ్ల‌కే "నిన్ను చూడాల‌ని".. మ‌హేశ్, ప‌వ‌న్ 25 ఏళ్ల‌కు.. బ‌న్నీ 20 ఏళ్ల‌కు "గంగోత్రి".. ప్ర‌భాస్ 22 ఏళ్ల‌కు "ఈశ్వ‌ర్".. ఇలా ప్ర‌తీ హీరో చాలా త‌క్కువ వయసులోనే వ‌చ్చారు.

Puri Jagannath going to direct Mokshagna Debut movie.. అవునా.. ఇదెక్కడి ట్విస్ట్..? అసలు అవకాశాలే లేని పూరీ జగన్నాథ్‌ను ఇప్పుడు బాలయ్య అయినా ఎలా నమ్ముతున్నాడు..? అసలు ఇది నిజమేనా..? పూరీ జగన్నాథ్ చేతిలో వారసున్ని పెడితే నందమూరి అభిమానులు ఊరుకుంటారా...? అసలు ఏ నమ్మకంతో పూరీ వైపు బాలయ్య చూస్తున్నాడు..? ఒక్క వార్త రాగానే ఇప్పుడు మోక్షు ఎంట్రీపై చాలా గాసిప్స్ వినిపిస్తున్నాయి. mokshagna entry,mokshagna puri jagannath,puri jagannath balakrishna,puri jagannath chirutha,puri mokshagna,mokshagna nandamuri,balakrishna mokshagna,పూరీ చేతిలో నందమూరి మోక్షజ్ఞ,మోక్షజ్ఞ పూరీ జగన్నాథ్,మోక్షజ్ఞ బాలకృష్ణ,మోక్షజ్ఞ పూరీ,పూరీ జగన్నాథ్ చిరుత,పూరీ జగన్నాథ్ పైసావసూల్ బాలయ్య,
మోక్షజ్ఞ పూరీ జగన్నాథ్

దాంతో ఇప్పుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని ఇప్పుడు నంద‌మూరి అభిమానులు బాల‌య్య‌ను ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి సమాధానంగా బర్త్ డే ఇంటర్వ్యూలో కూడా వారసుడు త్వరలోనే వస్తాడని చెప్పాడు బాలయ్య. ప్ర‌స్తుతం మోక్ష‌జ్ఞ న‌ట‌న‌తో పాటు డాన్సులు.. ఫిజిక్‌పై దృష్టి పెట్టాడు. బాల‌య్య డాన్సుల్లో కింగ్.. అలాంటి హీరో వార‌సుడు అంటే అభిమానులు ఊహించేది డాన్సులు. అందుకే ఈ విష‌యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ వార‌సుడు.మోక్షు ఎప్పుడొచ్చినా కూడా త‌నే సినిమా నిర్మిస్తాన‌ని సాయి కొర్ర‌పాటి చెబుతున్నాడు. ఇప్ప‌టికే ఈయ‌న కోసం "రానే వ‌చ్చాడు ఆ రామ‌య్యా" అంటూ టైటిల్ కూడా రిజిష్ట‌ర్ చేయించాడు.

Puri Jagannath going to direct Mokshagna Debut movie.. అవునా.. ఇదెక్కడి ట్విస్ట్..? అసలు అవకాశాలే లేని పూరీ జగన్నాథ్‌ను ఇప్పుడు బాలయ్య అయినా ఎలా నమ్ముతున్నాడు..? అసలు ఇది నిజమేనా..? పూరీ జగన్నాథ్ చేతిలో వారసున్ని పెడితే నందమూరి అభిమానులు ఊరుకుంటారా...? అసలు ఏ నమ్మకంతో పూరీ వైపు బాలయ్య చూస్తున్నాడు..? ఒక్క వార్త రాగానే ఇప్పుడు మోక్షు ఎంట్రీపై చాలా గాసిప్స్ వినిపిస్తున్నాయి. mokshagna entry,mokshagna puri jagannath,puri jagannath balakrishna,puri jagannath chirutha,puri mokshagna,mokshagna nandamuri,balakrishna mokshagna,పూరీ చేతిలో నందమూరి మోక్షజ్ఞ,మోక్షజ్ఞ పూరీ జగన్నాథ్,మోక్షజ్ఞ బాలకృష్ణ,మోక్షజ్ఞ పూరీ,పూరీ జగన్నాథ్ చిరుత,పూరీ జగన్నాథ్ పైసావసూల్ బాలయ్య,
ఎన్.టీ.ఆర్, బాలకృష్ణ, మోక్షజ్ఞ

బాల‌య్య కూడా త‌న వార‌సున్ని ముందు క్రిష్ చేతుల్లో పెట్టాల‌నుకున్నాడు కానీ ఇప్పుడు మన‌సు మార్చుకున్న‌ట్లు తెలుస్తుంది. ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ వైపు బాల‌య్య చూపులు ప‌డుతున్నాయ‌ని తెలుస్తుంది. వార‌సుల్ని ప‌రిచ‌యం చేయ‌డంలో పూరీ శైలి వేరు. "చిరుత‌"తో చ‌ర‌ణ్ కెరీర్‌కు కావాల్సినంత గ‌ట్టి పునాది వేసాడు పూరీ. ఇప్పుడు త‌న వార‌సున్ని కూడా ఆయ‌న చేతుల్లో పెట్టాల‌ని చూస్తున్నాడు బాల‌య్య‌. పైగా "పైసా వ‌సూల్" స‌మ‌యంలో పూరీకి బాల‌య్య బాగా క్లోజ్ అయ్యాడు. మ‌రి చూడాలిక‌.. మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎప్పుడో..? అన్నీ కుదిరి పూరీతోనే మోక్షు సినిమా చేస్తే మాత్రం అదెలా ఉండబోతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: June 7, 2020, 3:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading