హోమ్ /వార్తలు /సినిమా /

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ చాలా ‘డేంజర్’ బాబోయ్..

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ చాలా ‘డేంజర్’ బాబోయ్..

బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది.

బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది.

Balakrishna: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. లెజెండ్, సింహా లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో..

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. లెజెండ్, సింహా లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు అయితే తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాకు ముందు నుంచి చాలా టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ మాత్రం బిబి 3 అంటున్నారు. కరోనాకు ముందు వారం రోజుల షూటింగ్ చేసాడు బోయపాటి శ్రీను. అది కూడా అప్పట్లో ఉత్తరాదిన షూట్ చేసాడు. కానీ లాక్‌డౌన్ రావడంతో మళ్లీ ఆగిపోయింది.

బాలయ్య బోయపాటి శ్రీను (Balakrishna boyapati)
బాలయ్య బోయపాటి శ్రీను (Balakrishna boyapati)

ప్రస్తుతానికి మళ్లీ ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలు పెట్టాలా అని చూస్తున్నాడు బాలయ్య. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి శ్రీను. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. ముఖ్యంగా బాలయ్య డైలాగ్ డెలవరీ అద్భుతంగా పేలింది కూడా. ఈ సారి కూడా బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయం అయిపోయింది. ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్‌తో పాటు మరో రెండు మూడు టైటిల్స్ కూడా బాగానే ప్రచారంలోకి వచ్చాయి.

బాలకృష్ణ,బోయపాటి శ్రీను (Twitter/balakrishna boyapati)
బాలకృష్ణ,బోయపాటి శ్రీను (Twitter/balakrishna boyapati)

ఇదిలా ఉంటే ఇప్పుడు మాత్రం డేంజర్ అనే టైటిల్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. 2005లో కృష్ణవంశీ దర్శకత్వంలో ఇదే టైటిల్‌తో ఓ సినిమా వచ్చింది. కానీ సినిమా వచ్చి పదేళ్లు దాటిపోవడంతో ఈ టైటిల్ మరో సినిమాకు పెట్టుకోవచ్చు. దాంతో ఇప్పుడు ఇదే టైటిల్ బాలయ్య సినిమాకు పెడుతున్నారని తెలుస్తుంది. ఇదే టైటిల్ త్వరలో అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Balakrishna, Boyapati Srinu, Telugu Cinema, Tollywood