Home /News /movies /

SOUNDARYA SURRENDER TO ACP ROSHINI REGARDING KILLING MONITHA IN KARTHIKA DEEPAM SERIAL NR

Karthika Deepam: సౌందర్య వచ్చేసింది.. కీలక మలుపుతో వంటలక్క కుటుంబానికి ఆనందం.. కానీ ఆ ఒక్కటే?

Karthika Deepam

Karthika Deepam

Karthika Deepam: బుల్లితెర ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ మరింత ఆసక్తిగా మారింది. కథ మొత్తం చివరి దశలో ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో మాత్రం బాగా షాకిస్తున్నాడు డైరెక్టర్.

    Karthika Deepam: బుల్లితెర ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ మరింత ఆసక్తిగా మారింది. కథ మొత్తం చివరి దశలో ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో మాత్రం బాగా షాకిస్తున్నాడు డైరెక్టర్. రేటింగ్ కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. కార్తీక్ మోనిత ఇంటికి వెళ్లి ఎంతలా మండిపడ్డాడో చూశాం. ఇక మోనితపై గన్ పెట్టి చూపిస్తాడు. మోనిత తన మాటలతో ఎలా చంపేస్తావని ప్రశ్నించడంతో వెంటనే కార్తీక్ అరుస్తాడు.ఏ ప్రేమ కోసమే అయితే ఇదంతా చేసావో..నువ్వు ప్రేమించిన మనిషి చేతిలో చనిపో అంటూ గన్ కలుస్తాడు. కానీ కాల్చింది మాత్రం చూపించారు.

    కార్తీక్ మౌనంగా ఇంటికి వెళ్తాడు. దీప పక్కన కూర్చుంటాడు. దీపతో ఎంత ఎమోషనల్ గా మాట్లాడుతుంటాడు. తాను గతంలో దీపను నిందించిన విషయాల గురించి చెబుతూ ఏడుస్తుంటాడు. దీప కూడ ఏడుస్తూనే ఉంటుంది. అంతేకాకుండా తనవల్ల ఎంత పెద్ద తప్పు జరిగినా కూడా తన తల్లి స్టుపిడ్ అన్న మాట తప్ప ఏమీ అనలేదని ఎమోషనల్ అయ్యాడు. ఇక పిల్లల గురించి మాట్లాడుతూ.. సౌర్య తన కూతురు అని తెలియక ముందు పరాయి బిడ్డల్లా చూశానని తెలిపాడు.

    ఈ మాటలు మాట్లాడుతున్న కార్తీక్ ని చూసి దీప ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావ్ అని ప్రశ్నిస్తుంది.అలా కార్తీక్ తన గురించి చెబుతూనే మోనిత కడుపు గురించి చెబుతాడు. తన శాంపిల్స్ ద్వారా ఆర్టిఫిషియల్ కృత్రిమ గర్భం చేసుకుందని తెలిపాడు. నాకు తెలియని ప్రశ్న కు జవాబు దొరికింది అని చెబుతాడు. ఇంత జరిగినాక మోసం చేసిన మోనితను చంపేయాలి అనిపిస్తుందా లేదా అని ప్రశ్నించగా వెంటనే పిల్లలు వస్తారు. వారితో నవ్వుతో మాట్లాడుతుంటారు. మరోవైపు ఆనందరావు కార్తీక్ గురించి ఆలోచిస్తాడు.

    Karthika Deepam
    Karthika Deepam


    ఇక మరుసటి రోజు రోషిణి దగ్గరికి మోనిత గురించి చెప్పడానికి బయలుదేరుతున్న సమయంలో అదే సమయానికి రోషిణి వచ్చి కార్తీక్ నిజాయితీ గురించి మాట్లాడుతూ.. మోనిత ను చంపి శవం కూడా కనిపించకుండా చేస్తావా అని అంటుంది. వెంటనే దీప, కార్తీక్ షాక్ అవుతారు.దీప ఎంత చెప్పినా వినకుండా రోషిణి అసలు పట్టించుకోదు. దాంతో కార్తీక్ కుటుంబం మొత్తం తీవ్ర దుఃఖంలో మునిగిపోతుంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Doctor babu, Karthika deepam, Monitha, Nirupam paritala, Premi Vishwanath, Vantalakka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు