హోమ్ /వార్తలు /movies /

Karthika Deepam: డాక్టర్ బాబుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సౌందర్య.. బయటపడ్డ మోనిత అసలు రంగు?

Karthika Deepam: డాక్టర్ బాబుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సౌందర్య.. బయటపడ్డ మోనిత అసలు రంగు?

Karthika Deepam: ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ మరింత ఆసక్తిగా మారటంతో ఏం జరుగుతుందో అనే ప్రశ్న ఎదురవుతుంది. ఇక దీప.. కార్తీక్ ను క్షమిస్తుందా లేదా అని అనుమానాలు ఎదురవుతున్నాయి.

    Karthika Deepam: ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ మరింత ఆసక్తిగా మారటంతో ఏం జరుగుతుందో అనే ప్రశ్న ఎదురవుతుంది. ఇక దీప.. కార్తీక్ ను క్షమిస్తుందా లేదా అని అనుమానాలు ఎదురవుతున్నాయి. ఇక కార్తీక్ మోనిత దగ్గరికి వెళ్లి అలా అబార్షన్ చేయించుకో అన్నట్లు తనతో నసుగుతాడు. కానీ మోనిత మాత్రం తన పంతాన్ని తగ్గించుకోదు. నాకు అన్యాయం చేయకు అంటూ.. నా మెడలో తాళి కట్టి భార్య స్థానంలో ఉంచమని కోరుతుంది. నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకోకపోతే.. నేను మరో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అంటూ.. నీ యాక్షన్ బట్టి నా రియాక్షన్ ఉంటుందని.. ఆలోచించుకోమని వార్నింగ్ ఇస్తుంది మోనిత.

    ఇక పిల్లలు ఆ గోడ మీద గీతలేంటి అని.. నాన్నకి ఏమైంది అని రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు. కానీ దీప మాత్రం ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. ఇక సౌర్య అదేంటో నేను కనిపెడతా అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. పిల్లల మాటకు దీప మళ్లీ ఆలోచనలో పడుతుంది. ఇక కార్తీక్ మోనిత దగ్గర జరిగిన విషయాన్ని సౌందర్యకు తెలుపుతాడు. ఇక సౌందర్య నేను చేయగలిగింది ఏమీ లేదంటూ అనగా కార్తీక్ సౌందర్యాన్ని బ్రతిమాలుతాడు. కానీ సౌందర్య మాత్రం తన మాటలతో కార్తీక్ ని ఏం చేయాలని ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా మోనిత సౌందర్య దగ్గరికి వచ్చి నాకు న్యాయం చేయండి ఆంటీ అని తన కాళ్ల మీద పడ్డ విషయాన్ని తెలుపుతుంది సౌందర్య.

    కార్తీక్ మాత్రం తన కాపురాన్ని నిలబెట్టుకోవడానికి బాగా వేడుకుంటాడు. ప్లీజ్ మమ్మీ దారి చూపించని కోరుకుంటాడు. కానీ సౌందర్య మాత్రం తన మాటలతో కార్తీక్ ను మరింత బాధ పెడుతుంది. ఇక దీప దగ్గరికి పిల్లలు వచ్చి తమ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అంతలోనే కార్తీక్ పిల్లలకు తినడానికి చాక్లెట్స్ తీసుకొని వస్తాడు. ఆ పిల్లలకి ఇవ్వగా పిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తెల్లారితే కార్తీక్ హాల్లో లేకపోయేసరికి దీప వెతుకుతూ బయటికి వస్తుంది. ఇక రెండు కుర్చీల మీద కూర్చున్న కార్తీక్ ను చూసి జాలితో దీప టీ పట్టుకొని డాక్టర్ బాబు అని నిద్ర లేపుతుంది.

    First published:

    ఉత్తమ కథలు