• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SOUNDARYA SERIOUS ON VANTALAKKA AND MONITHA HAPPINESS IN KARTHIKA DEEPAM TELUGU SERIAL NR

Karthika Deepam: దీపను తిట్టిపోస్తున్న సౌందర్య.. ఆనందంలో తేలిపోతున్న మోనిత!

Karthika Deepam: దీపను తిట్టిపోస్తున్న సౌందర్య.. ఆనందంలో తేలిపోతున్న మోనిత!

karthika deepam

Karthika Deepam: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్స్ గురించి తెలుగు రాష్ట్రాలలో తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరనే చెప్పవచ్చు.

  • Share this:
    Karthika Deepam: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్స్ గురించి తెలుగు రాష్ట్రాలలో తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరనే చెప్పవచ్చు. రోజు రోజుకి ఈ సీరియల్ కథ ఆసక్తిగా మారడంతో.. ప్రేక్షకులు ఈ సీరియల్ సమయం గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారని అర్థమవుతుంది. ఇక ఈ సీరియల్ సమయంలో స్టార్ మా కు వచ్చే రేటింగ్ అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

    నిన్నటి భాగంలో దీప వంటగదిలో అడుగుపెట్టగా.. కార్తీక్ దీప వంట చేస్తే ఇంట్లో ఉండటానికి వీలు లేదు అంటూ తన పిల్లలతో అంటుంటాడు. కానీ దీప తనతో వంట చేయిస్తేనే టాబ్లెట్ వేసుకుంటా అని షాక్ ఇచ్చింది. కానీ ఇదంతా తనకు ఏం సమస్య ఉందో, కార్తీక్ ఇలా ఎందుకు చేస్తున్నాడో అని తెలుసుకోవడానికి తాను చేస్తున్న ప్లాన్ ఇది. ఇక పిల్లలు కూడా తమ అమ్మ చేతి వంట రుచి చూడడానికి కూడా ఆసక్తి చూపుతారు.ఇక కార్తీక్.. ఈ విషయం గురించి మోనిత కు చెప్పకుండా ఉంటాడా..! ఇక వెంటనే జరిగినదంతా ఆమెకు ఫోన్ చేసి చెబుతాడు కార్తీక్. ఇక మోనిత తన తెలివితో మాట్లాడి కట్ చేస్తుంది. ఇక దీపని ఎప్పుడెప్పుడు పైకి పంపించాలా అని బాగా కుతూహలం అవుతుంది.

    ఇక దీప తమ మాట వినట్లేదని ఏం చేయలేమంటూ బాధపడతారు కార్తీక్, సౌందర్య లు. ఇక దీప తన కుటుంబ సభ్యులతో టిఫిన్ చేయడానికి సిద్ధమవ్వగా.. కార్తీక్ బయటినుండి టిఫిన్ తెప్పించుకుంటాడు. బయట నుండి ఎందుకు తెప్పించుకున్నావని ఆనందరావు కార్తీక్ పై అరుస్తాడు. కానీ సౌందర్య కార్తీక్ కు సపోర్ట్ గా మాట్లాడగా.. వెంటనే దీప రియాక్ట్ అవుతూ సౌందర్య తో కోపంగా మాట్లాడుతుంది. దీంతో దీప తన మాటలతో రెచ్చిపోతూ అరుస్తుంటే.. వెంటనే కార్తీక్ అసలు నీ పరిస్థితి అని తన అనారోగ్యం గురించి నోరు జారబోతుంటే.. వెంటనే సౌందర్య ఆపే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ తర్వాత దీప రియాక్షన్ ఏంటో తర్వాత ఎపిసోడ్ లో చూడాల్సిందే.
    Published by:Navya Reddy
    First published: