హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: కార్తీక్ కాపురం నిలబెట్టేందుకు సౌందర్య షాకింగ్ ప్లాన్.. త్వరలోనే శుభం కార్డు?

Karthika Deepam: కార్తీక్ కాపురం నిలబెట్టేందుకు సౌందర్య షాకింగ్ ప్లాన్.. త్వరలోనే శుభం కార్డు?

వాళ్ళను తమ సొంత మనుషుల్లా ట్రీట్ చేస్తున్నారు అభిమానులు కూడా. కార్తీక దీపంలోని కార్తీక్, దీప పాత్రలు మాత్రమే కాకుండా మోనిత, సౌందర్య, ఇద్దరు పిల్లలు.. ఇలా ప్రతీ ఒక్కరూ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైపోయారు.

వాళ్ళను తమ సొంత మనుషుల్లా ట్రీట్ చేస్తున్నారు అభిమానులు కూడా. కార్తీక దీపంలోని కార్తీక్, దీప పాత్రలు మాత్రమే కాకుండా మోనిత, సౌందర్య, ఇద్దరు పిల్లలు.. ఇలా ప్రతీ ఒక్కరూ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైపోయారు.

Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. దీంతో ప్రేక్షకులు కూడా ఈ సీరియల్ ను వదలకుండా చూస్తున్నారు. అసలు దీప, కార్తీక్ లు కలుస్తారా లేదా అని మరింత ఆసక్తితో చూస్తున్నారు.

  Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. దీంతో ప్రేక్షకులు కూడా ఈ సీరియల్ ను వదలకుండా చూస్తున్నారు. అసలు దీప, కార్తీక్ లు కలుస్తారా లేదా అని మరింత ఆసక్తితో చూస్తున్నారు. ఇక కార్తీక్ దగ్గరకు వచ్చిన లక్ష్మణ్ హెల్త్ రిపోర్ట్స్ చూపించగా కార్తీక్ సలహాలు ఇస్తాడు. ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో అని నెలకు 25 వేలు ఇస్తా అని అనడంతో లక్ష్మణ్ ఎమోషనల్ అవుతూ కార్తీక్ ను పొగుడుతాడు. ఇక దీపతో కూడా కార్తీక్ మనస్తత్వం గురించి మాట్లాడుతాడు. ఇక హిమ, దీప మార్కెట్ కు అని బయలుదేరుతుంటారు.సౌందర్య.. దీప, కార్తీక్ లా జీవితం గురించి మాట్లాడుతూ మోనిత కు వార్నింగ్ ఇవ్వాలని సీక్రెట్ గా భాగ్యంతో మాట్లాడుతుంది. భాగ్యం కూడా సలహాలు ఇచ్చి వెళ్ళిపోతుంది.

  కార్తీక్ ఇంట్లో ఒంటరిగా గోడ వైపు చూస్తూ టెన్షన్ పడతాడు. అప్పుడే సౌర్య వచ్చి గీతల గురించి ప్రశ్నిస్తుంది. ఇక కార్తీక్ గతంలో సౌర్య అన్న మాటలు తలచుకొని తనను ఎత్తుకొని గిర్రున తిప్పుతాడు. గుమ్మం దగ్గరే నించొని ఉన్న సౌందర్య అలా చూసి సంతోషిస్తుంది. సౌర్య మాటలకు కార్తీక్ సమాధానం చెబుతూ ఉంటే సౌందర్య సంబరపడుతుంది.ఇక సౌందర్య.. సౌర్యను లోపలికి పంపించి గీతల్ని చేరిపేయమని సలహాలు ఇస్తుంది. దీప తో తన బాధని పంచుకోమని ధైర్యం ఇస్తుంది. ఇక దీప, హిమ లు ఆటోలో వెళ్తున్నప్పుడు హిమ.. దీప తో మాట్లాడుతుండగా.. ఇక దీప హిమ మాటలకు ఎమోషనల్ అవుతుంది. ఇక కార్తీక్ బాధతో ఏడుస్తూ ఉంటే పక్కనే వచ్చి కూర్చుంటుంది దీప.

  ఇక తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదని మరో రూపంలో నైనా భగవంతుడు తెలియజేసి ఉండొచ్చు కదా.. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పిన వ్యక్తికే నా వల్ల అలా జరగడం అని అనడంతో వెంటనే దీప షాక్ అవుతూ మొత్తానికి నిజం తెలిసి పోయేటట్లుగా పిల్లలు పుట్టారని మోనిత చెప్పిందా అని ప్రశ్నిస్తుంది. ఇక వెంటనే కార్తీక్ అవును అనడంతో దీపకు మొత్తానికి మోనిత పై అనుమానం వస్తుంది. అంతేకాకుండా కార్తీక్ మోనిత ఇంట్లో పీకలదాకా తాగానని మద్యం మత్తులో ఏం జరిగిందో తెలియదని క్షమించు దీప అని కోరుతాడు. దీంతో దీప.. ఇదంతా మోనిత చేసిన ప్లాన్ అనే ఆలోచన పడుతుంది.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Deepa, Karthika, Karthika Deepam serial, Monitha, Telugu serial, Vantalakka

  ఉత్తమ కథలు