Home /News /movies /

SOUNDARYA ADVISES DEEPA TO STOP THINKING NEGATIVE ABOUT KARTHIK IN KARTHIKA DEEPAM SERIAL TODAYS TODAYS EPISODE NR

Karthika Deepam: కార్తీక్ చెప్పే నిజం కోసం మల్లెపూలు పెట్టుకొని ఎదురుచూస్తున్న వంటలక్క..?

Karthika Deepam

Karthika Deepam

Karthika Deepam: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ఆసక్తిగా మారడంతో రేటింగ్ విషయంలో మరింత దూసుకుపోతుంది. ఇక సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ కు అలవాటు పడ్డారు.

    Karthika Deepam: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ఆసక్తిగా మారడంతో రేటింగ్ విషయంలో మరింత దూసుకుపోతుంది. ఇక సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ కు అలవాటు పడ్డారు. ఇదిలా ఉంటే దీప కార్తీక్ చెప్పబోయే దాని గురించి బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం జరుగుతుందని తనలో తాను కుమిలిపోతుంది. సౌందర్య వచ్చి ధైర్యం చెబుతుంది. ఇక భాగ్యం కార్తీక్ మారిపోయాడా లేదా అని ఆలోచిస్తుంది. ఇక దీప అదే విషయాన్ని తలుచుకుంటూ ఉండగా సౌందర్య మల్లె పూలు తెచ్చి దీపను పెట్టుకోమంటుంది.

    కానీ దీప మాత్రం అలాగే బాధపడుతూ ఉంటుంది. కానీ సౌందర్య పిల్లలు లేరని కార్తీక్ తో సరదాగా గడపమని పైకి పంపిస్తుంది.ఇక కార్తీక్ గదిలోకి దీప భయంతోనే వెళ్తున్న సమయంలో కార్తీక్ దగ్గర మందు గ్లాసు చూసి వెనుకకు వస్తుంది.ఆ విషయాన్ని సౌందర్యతో చెబుతుంది.కార్తీక్ తాగుతున్నాడని తెలిసి సౌందర్య షాక్ అవుతుంది. ఇక మోనిత ప్రియమణికి కాఫీ చేసి తెచ్చి ఇచ్చింది. తాగవే ఫ్యూచర్ లో కార్తీక్ కి పెట్టి ఇవ్వాలి కదా అంటూ ప్రాక్టీస్ ఉంటుంది కదా అని పెట్టాను అంటుంది. ఇక కార్తీక్ దగ్గరికి వెళ్లడానికి హడావుడి చేస్తుంది. తన హడావిడి చూస్తే దీప కొంప ముంచేలా ఉందని ప్రియమణి అనుకుంటుంది. ఇక సౌందర్య ఇంట్లో పూజలు ఏర్పాట్లు జరుగుతుంటాయి.

    ఇక ఆ సమయంలో భాగ్యం కాలు నొప్పి ఉండటం తో మురళీకృష్ణ మాత్రమే వస్తాడు.దీప, కార్తీక్ లు వేర్వేరు గదుల్లో పూజ కోసం రెడీ అవుతారు.కానీ దీప మనసులో మాత్రం కార్తిక్ ఏం చెబుతాడో అని టెన్షన్ పడుతుంది. కార్తీక్ దీప కోసం గిఫ్ట్ ఇవ్వడానికి శ్రీశ్రీ పుస్తకాన్ని ప్యాక్ చేస్తాడు. దీపకు ప్రేమతో డాక్టర్ బాబు అంటూ రాస్తూ మురిసిపోతాడు. కార్తీక్ కు దీపపై ప్రేమ చిగురిస్తున్న వేళ మోనిత మళ్లీ ఏదో ప్లాన్ తో కొంప ముంచడానికి సిద్ధమయ్యేలా ఉంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్ లో చూడాలి.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Doctor babu, Karthika deepam, Premi vishwanth, Vantalakka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు