Soundarya Birth Anniversary : సౌందర్య అసలు పేరు ఏంటీ.. ఆమె భర్త ఎవరు.. 49వ జయంతి సందర్భంగా..

Soundarya Photo : Twitter

Soundarya Birth Anniversary : సౌందర్య ఈ పేరుకు పత్యేక పరిచయాలు అక్కర లేదు. సౌందర్య కన్నడనాట పుట్టినా, తెలుగు చిత్రాలలో నటించి మెప్పించింది. ఈరోజ ఆమె 49వ జయంతి సందర్భంగా స్పెషల్ స్టోరి..

 • Share this:
  సౌందర్య ఈ పేరుకు పత్యేక పరిచయాలు అక్కర లేదు. సౌందర్య కన్నడనాట పుట్టినా, తెలుగు చిత్రాలలో నటించి మెప్పించింది. ఆమె ముగ్ధమనోహర రూపం, ఆమె నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. సౌందర్య అసలు పేరు సౌమ్య. సౌందర్య తండ్రి సత్యనారాయణకు చిత్రసీమతో అనుబంధం ఉంది. ఆయన రచయితగా, నిర్మాతగా కన్నడలో రాణించారు. 'గంధర్వ' అనే కన్నడ చిత్రంలో నటించింది. ఆ తర్వాత అదే తెలుగులో పి.ఎన్.రామచంద్రరావు రూపొందించిన 'మనవరాలి పెళ్ళి'లో నటించారు. ఆ సమయంలోనే కృష్ణ హీరోగా తెరకెక్కిన 'రైతు భారతం'లోనూ ఆమెకు అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా ఆమెకు పెద్దగా గుర్తింపును ఇవ్వలేదు. ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు మంచి గుర్తింపును ఇచ్చాయి. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున్ డబుల్‌లో చేసిన హలో బ్రదర్ కూడా సౌందర్యకు మంచి పేరును తెచ్చింది. అలా ఆ తర్వాత మోహన్ బాబు పెదరాయుడు, చిరంజీవి గుణ శేఖర్ కాంబినేషన్‌లో చూడాలనివుంది వంటి నటించి సూపర్ పాపులర్ అయ్యింది సౌందర్య. ఇక ముఖ్యంగా వెంకటేష్‌లో ఆమె చాలా సినిమాలు చేసింది. ఈ కాంబినేషన్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఇద్దరు జంటగా నటించిన ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు, పవిత్రబంధం, పెళ్ళిచేసుకుందాం, రాజా, జయం మనదేరా వంటి సినిమాలు మంచి విజయాలను సాధించాయి.

  సౌందర్య నటన విషయానికి వస్తే.. వెంకటేష్ ప్రధాన పాత్రలో వచ్చిన పవిత్రబంధంలో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో వెంటకేష్ కాంక్రాక్ట్‌ భార్యగా సౌందర్య నటన ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆ సినిమాతో ఆమెను మహానటి సావిత్రితో పోల్చారు జనాలు. ఇక ఆ తర్వాత ఇదే కాంబినేషన్‌లో వచ్చిన పెళ్ళిచేసుకుందాం సినిమా కూడా మంచి పేరు తెచ్చింది సౌందర్యకు. ఈ సినిమాలో రేప్‌కు బలైన యువతి పాత్రలో సౌందర్య నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ రెండు చిత్రాలలో సౌందర్య అభినయం చూసిన తెలుగు జనం మరో సావిత్రి అన్నారు . ఇక అందాల ప్రదర్శనకు దూరంగా ఉండే సౌందర్య చీరకట్టులోనే కుర్రకారును నిద్రపోకుండా చేసేవారు. ఇక ఆమె కన్నడలో 2004లో నటించిన చివరి చిత్రం ఆప్త మిత్ర. ఈ చిత్రంలో తన నటనకు ఫిల్మ్ అవార్డ్ లభించింది. వెంకటేష్ సరసన పవిత్రబంధంలో తన నటనకు ఉత్తమ నటిగా నంది అవార్డ్ అందుకుంది.

  Soundarya,Soundarya hot photos,Soundarya hot videos,Soundarya exposing,Soundarya rain songs,Soundarya movies,Soundarya death secrets,Soundarya Aamani friendship,telugu cinema,సౌందర్య,సౌందర్య ఆమని స్నేహం,సౌందర్య ఎక్స్‌పోజింగ్,సౌందర్య హాట్ ఫోటోలు
  సౌందర్య ఫోటోస్ (Soundarya photos/twitter)


  ఇక బాలయ్య హీరోగా చేస్తూనే దర్శకత్వం వహించిన నర్తన శాలలో సౌందర్య నటించారు. ఈ సినిమానే ఆమె చివరి చిత్రంగా మిగిలింది. పౌరాణిక చిత్రం 'నర్తనశాల'లో సౌందర్యనే ద్రౌపది పాత్రకు ఎంచుకున్నారు బాలకృష్ణ. ఈ సినిమా ప్రారంభం అయిన తరువాత రెండు రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుంది. ఆ తరువాత సౌందర్య 2004లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి వెళ్తూ బెంగళూరు నుంచి కరీంనగర్ మార్గంలో హెలికాప్టర్ క్రాష్ లో ఏప్రిల్ 17న కన్నుమూశారు. ఆ ప్రమాదంలో ఆమెతో పాటు ఆమె సోదరుడు అమర్ కూడా కన్నుమూశారు. సౌందర్య కేవలం 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. సౌందర్య అసలు పేరు సౌమ్య. సౌందర్య 2003లో రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న సంవత్సరానికే ఆమె ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. సౌందర్య మరణం తర్వాత రఘు 2011లో అపూర్వ అనే అమ్మాయి చేసుకున్నారు. ఆ తర్వాత గోవాలో సెటిల్ అయ్యారు.
  Published by:Suresh Rachamalla
  First published: