• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SONU SOOD WARNS FRAUDSTERS PEOPLE SHOULD BE CAREFUL WITH SUCH UN KNOWN PERSONS TA

Sonu Sood: మోసగాళ్లకు సోనూ సూద్ హెచ్చరిక... అలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలంటూ..

Sonu Sood: మోసగాళ్లకు సోనూ సూద్ హెచ్చరిక... అలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలంటూ..

సోనూసూద్(ఫైల్ ఫొటో)

Sonu Sood : గత కొన్ని రోజులుగా కొంత మంది తన లెటర్ హెడ్ తో  ఋణాలు ఇస్తామంటూ అమాయకులను నమ్మించి  అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు.

  • Share this:
    Sonu Sood : తన పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న కేటుగాళ్లకు సోనూ సూద్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు.  గత కొన్ని రోజులుగా కొంత మంది సోనూ సూద్ లెటర్ హెడ్ తో  ఋణాలు ఇస్తామంటూ అమాయకులను నమ్మించి  అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. అంతేకాదు తన పేరున ఉన్న సోనూసూద్ ఫౌండేషన్ పేరు మీద అక్రమంగా డబ్బులు దండుకుంటున్న మోసగాళ్లుకు ఈ రియల్ హీరో సోషల్ మీడియా వేదికగా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. తన పేరు మీద ఓ లెటర్ హెడ్ తయారు చేసి దాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసారు. ఇందులో భాగంగా తన పేరున ఉన్న లెటర్ హెడ్ ద్వారా 60 నెలల ఈఎంఐ చొప్పన రూ. 5 లక్షల లోన్ తీసుకునే విధంగా సోనూ సూద్ సౌకర్యం కల్పిస్తుందని కొంత మంది అమాయకుల నుంచి కేటుగాళ్లు అక్రమంగా డబ్బు దోచుకుంటున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి ‌ఋణాలు ఇస్తున్నట్టు నేను ఎక్కడ పేర్కొనలేదని సోనూ సూద్ పేర్కొన్నాడు. అంతేకాదు డబ్బుల కోసం కేటుగాళ్లు క్రియేట్ చేసిన ఫేక్ లెటర్ హెడ్‌ను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసాడు. ఇటువంటి మాయగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోనూ సూద్ పేర్కొన్నాడు. తన పేరిట అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ముంబాయితో పాటు యూపీ పోలీసులకు సోనూ సూద్ ఫిర్యాదు చేసాడు.

    సదరు సోనూ సూద్ పేరిట సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆ లెటర్ హెడ్‌లో  ముందుగా లోను  మంజూరు కావాలంటే ముందుగా రూ. 3500 చెల్లించాలని కండిషన్ పెట్టారు సదరు కేటుగాళ్లు. ఈ అమౌంట్ జమ చేసిన వారికి వెంటనే లోన్ ఓకే అవుతుందని పేర్కొన్నారు. అంతేకాదు ప్రతి నెల రూ. 8 వేలు ఠంచనుగా ఈఎంఐ కట్టాలని ఆ లెటర్ హెడ్‌లో అందరు నమ్మే విధంగా  ఆ లెటర్ హెడ్ ఉంది.


    మరోవైపు సామాజిక మాధ్యమాల్లో తన పేరిట లోన్లు ఇస్తామంటూ ఎవరైనా కాల్ చేస్తే.. వెంటనే 9007224111 ఫోన్‌కు కాల్ చేయమని చెప్పాడు. మరోవైపు సోనూసూద్ .. మన దేశంలోనే అతిపెద్ద బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పాడు.మన దేశంలో రక్తం లేని కారణంగా రోజుకు దాదాపు 12000 వేలకు పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. మనుషుల ప్రాణాలు కాపాడాలంటే డాక్టర్లే కావాల్సిన అవసరం లేదు. బ్లడ్ డొనేటర్స్ అయనా చాలన్నారు. రక్త దానం కోసం ఓ 20 నిమిషాలు వెచ్చిస్తే చాలన్నారు.

    Sonu Sood warns fraudsters People Should be careful with such Un Known Persons,sonu sood,Sonu Sood warns fraudsters,sonusood,Sonu Sood announces scholarship to poor students, sonu sood,sonu sood twitter,sonu sood assets,sonu sood properties,sonu sood movies,sonu sood assets details,sonu sood instagram,sonu sood daily labors help,sonu sood movies,sonu sood coronavirus,sonu sood old lady video,telugu cinema,సోనూ సూద్,సోనూ సూద్ కరోనా వైరస్,సోనూ సూద్ ఆస్తులు 130 కోట్లు,హ్యాపీ బర్త్ డే సోనూ సూద్,సోనూ సూద్ పుట్టినరోజు శుభాకాంక్షలు,సోనూ సూద్ రియల్ హీరో,సోనూ సూద్ నిజమైన హీరో,పేద విద్యార్ధులకు స్కాలర్ షిప్ ప్రకటించిన సోనూ సూద్
    సోనూ సూద్ (Twitter/Photo)


    సోనూ సూద్ విషయానికొస్తే..  కరోనా సమయంలో ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకుంటూ  నిజమైన ఆపద్భాందవుడు అనిపించుకున్నాడు. కరోనా లాక్‌డౌన్ ముందు వరకు సోనూసూద్‌ను మాములు నటుడిగానే చూసారు చాలా మంది. కానీ కరోనా సందర్భంగా ఏర్పడ్డ లాక్‌డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకు పోయిన కార్మికులను వాళ్ల స్వస్తలాలకు వెళ్లేలా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసాడు.కొంత మంది ఏకంగా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాలు సైతం చేయలేని సాయాన్ని చేసి నిజమైన హీరో అనిపించుకున్నాడు. కొంత మందికి ఉద్యోగాలు కూడా కల్పించిన సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు