SONU SOOD VS INDIAN ARMY A LETTER FROM INDIAN ARMY COMMANDING OFFICER TO SONU SOOD CREATES FUROR IN INDIAN ARMY NK
Sonu Sood vs Indian Army: భారత ఆర్మీకి షాక్ ఇచ్చిన సోనూసూద్... ఏమైందంటే...
భారత ఆర్మీకి షాక్ ఇచ్చిన సోనూసూద్ (File Image)
Sonu Sood vs Indian Army: సోనూసూద్‌కి ఇండియన్ ఆర్మీ అంటే ఎంతో గౌరవం, అభిమానం. ఆ మధ్య కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇండియన్ ఆర్మీతో కలిసి పాల్గొన్నాడు. మరి అతను ఏ షాక్ ఇచ్చాడు? ఎలా ఇచ్చాడు?
Sonu Sood vs Indian Army: కరోనా టైంలో రియల్ హీరోగా గుర్తింపు పొందుతున్న సోనూసూద్ అంశం ఒకటి ఇండియన్ ఆర్మీలో కలకలం రేపుతోంది. ఈ అంశంలో సోనూసూద్‌కి ఎలాంటి సంబంధమూ లేకపోయినా... కేంద్రబిందువు ఆయనే అయ్యారు. ఈమధ్య రాజస్థాన్... జైసల్మీర్‌లో ఇన్ఫాంట్రీ బెటాలియన్‌కి చెందిన ఓ కమాండింగ్ ఆఫీసర్ (CO)... సోనూసూద్‌కి ఓ లేఖ రాశారు. అందులో... కరోనాను తగ్గించేందుకు ఏమేం కావాలో రాశారు. అవి ఇచ్చి సాయం చేయాల్సిందిగా కోరారు. ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చివరకు ఇండియన్ ఆర్మీ కూడా సోనూసూద్ సాయం కోరిందని నెటిజన్లు అంటుంటే... లేఖపై అభ్యంతరం చెబుతూ... ఆర్మీకి చెందిన పై అధికారులు ఇప్పుడు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
మే 13న సోనూసూద్‌ను మెచ్చుకుంటూ ఈ లేఖ రాశారు సీఓ. కరోనా సమయంలో... సోనూసూద్ ముందుండి ఆదుకుంటున్నారని మెచ్చుకున్నారు. ఇండియన్ ఆర్మీ కూడా జైస్మల్మీర్ మిలిటరీ స్టేషన్ దగ్గర 200 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కేంద్రం కోసం కొన్ని పరికరాలు కావాలని కోరారు. అవి 4 ఐసీయూ బెడ్లు, 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 10 జంబో ఆక్సిజన్ సిలిండర్లు, ఒక ఎక్స్‌రే మిషన్, 2.. 15 KVA జనరేటర్ సెట్స్ కావాలని కోరారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వీటిని సమకూర్చాలని కోరారు. ఈ సాయాన్ని ఎప్పటికీ గుర్తుంటుకుంటామని తెలిపారు.
Am unaware about the provenance of this letter, but if it turns out to be real, it indicates the sad state, Indian armed forces have been reduced to.
One of the major promises, this man made, was to ensure the armed forces were well provided for.
Shame on the powers that be. pic.twitter.com/CEW1obAHyS
ఈ లేఖ రాసిన మాట వాస్తవమేనని ఢిల్లీలోని ఇండియన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని ఓ సీనియర్ ఆఫీసర్ తెలిపారు. అత్యుత్సాహంతోనే ఇలా రాశారని అన్నారు.
ఇండియన్ ఆర్మీ... దేశవ్యాప్తంగా చాలా చోట్ల కోవిడ్ కేర్ ఆస్పత్రుల్ని ఏర్పాటుచేసింది. ఇందుకు కావాల్సిన సామగ్రిని ఆర్మీ స్వయంగా సమకూర్చింది. రాజస్తాన్‌లోని శ్రీ గంగానగర్‌లో 50 పడగల ఆస్పత్రిని నిర్మించి నడిపిస్తోంది. దీనికి కూడా కావాల్సిన అన్ని సదుపాయాలూ ఆర్మీయే సమకూర్చింది.
సామాన్య ప్రజలు, పేదవారూ... ఇలా సోనూసూద్‌ని సాయం కోరడం సహజంగా జరుగుతోంది. ఇందుకోసం సోనూసూద్ ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. అందువల్ల రోజూ చాలా మంది ఆయన ద్వారా సాయం పొందుతున్నారు. ఇండియన్ ఆర్మీ... సరిహద్దుల్లో దేశాన్ని కాపాడటమే కాదు... విపత్తు సమయాల్లో... రెస్క్యూ ఆపరేషన్లు కూడా నిర్వహిస్తోంది. ఇప్పుడు కరోనా టైమ్‌లో కూడా... ఆస్పత్రుల నిర్మాణం, ఇతర కార్యకలాపాలు చేపడుతోంది.
నెటిజన్లు ఈ లేఖను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇండియన్ ఆర్మీ కూడా సోనూ సూద్ సాయం కోరుతోంది అంటూ కామెంట్లు రాస్తున్నారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.