కోవిడ్ సమయంలో ఎంతో మంది పేదలకు అండగా నిలబడి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ తన సహాయ కార్యక్రమాలను కంటిన్యూ చేస్తున్నారు. చాలా మందికి చదువు, ఉద్యోగం, ఆరోగ్యం వంటి విషయాలకు సంబంధించి సోనూసూద్ తన సహాయ కార్యక్రమాలను కంటిన్యూ చేస్తున్నారు. సోనూసూద్ ఉదారతను చూసిన వారందరూ అతని సెల్యూట్ చేస్తున్నారు. సోనూసూద్ చేస్తున్న కార్యక్రమాలను చూసి చాలా మందిఆయనకు అభిమానులుగా మారిపోయారు. కొందరు గుడి కడితే, కొందరు వారి పిల్లలకు సోనూసూద్ పేరు పెట్టుకుంటున్నారు. మరికొందరైతే వారి షాపులకు కూడా సోనూసూద్ పేరు పెట్టారు. హైదరాబాద్‌లో ఉన్న సోనూసూద్ సదరు అభిమానులు కలుసుకుని తన పేరు మీద పెట్టిన షాపులను ఓపెన్ చేస్తన్నాడు.
తాజాగా.. మరోసారి మరో అభిమాని అయితే ఏకంగా సోనూసూద్ పేరిట అంబులెన్స్ సర్వీసును ఓపెన్ చేశాడు. ఈ సోనూసూద్ అంబులెన్స్ సర్వీసుని స్వయంగా సోనూసూదే వచ్చి ఓపెన్ చేశాడు. ఇంతకీ ఆ విషయం ఎక్కడ జరగిందో తెలుసా! మన హైదరాబాద్‌లోనే. ట్యాంక్ బండ్ శివ అనే వ్యక్తి .. వైద్య సదుపాయం లేని ప్రాంతాల్లోని ప్రజలకు సేవ చేయడానికి సోనూసూద్ అంబులెన్స్ సర్వీసుని ప్రారంభించాడు. దీనికి సోనూసూద్ హాజరై తన ఆశీస్సులను అందించాడు అదీ సంగతి.
ఇక సినిమాల విషయానికి వస్తే సోనూసూద్ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన అల్లుడు అదుర్స్‌లో నటించాడు. దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలోనూ విలన్‌గా నటించాడు. ప్రస్తుతం చేతిలో ఉన్న కమిట్మెంట్స్ పూర్తయితే.. ఇకపై హీరోగానే సోనూసూద్ సినిమాలు చేయడానికి నిర్ణయించుకున్నాడు.