సోను సూద్.. (Sonu Sood)రీల్ లైఫ్ విలన్ అయినా.. రియల్ లైఫ్‌లో మాత్రం హీరో. ఎవరికి ఏ కష్టం వచ్చిన టక్కున వాలిపోతాడు. నేనున్నానంటూ.. వారికి సాయం చేస్తాడు. ఎలాంటి సాయం అయినా.. వెనుకాడాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో వేలాది కుటుంబాలకు ఆర్థిక సాయం చేశాడు సోను సూద్. తాజాగా మైనర్ రేప్ కేసుపై సోనూసూద్ స్పందించారు. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ బాలిక అత్యాచార కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందనే విషయాన్ని న్యూస్ లో చూసి షాక్ కు గురయ్యానని సోనూసూద్ చెప్పారు.
ఇది చాలా పెద్ద నేరమని అన్నారు. అత్యాచారానికి పాల్పడింది మేజర్లా లేక మైనర్లా అనేది ముఖ్యం కాదని... వారు ఎలాంటి నేరం చేశారనేదే ముఖ్యమన్నారు సోను సూద్. ఇలాంటి ఘటనలకు పబ్స్ కారణమనేది తప్పని వారించాడు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, మనం చూసే విధానం తప్పుగా ఉంటే చెడు ఆలోచనలు వస్తాయని పేర్కొన్నాడు.
రొమేనియాకు చెందిన బాలికను ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని కారులో ఎక్కించుకుని ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులోని నిందితుల్లో ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే మనవడితోపాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఇప్పటికే క్రైమ్‌సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించిన పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.
మరోవైపు ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి . ప్రధాన నిందితుడైన సాదుద్దీన్ పోలీస్ కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులో శాస్త్రీపురం కార్పొరేటర్ కుమారుడు అసలు సూత్రధారి అని సాదుద్దీన్ పోలీసులకు వివరించాడు. తనను పబ్ దగ్గర వదిలి అమ్మాయిని బెంజ్ కారులో ఎక్కించుకున్నాడు. తాను బెంజ్ కారులో కాకుండా ఇన్నోవాలో బేకరికి వెళ్లానన్నాడు. బెంజ్ కారులోకి ఎక్కగానే మైనర్ అమ్మాయిని ఎమ్మెల్యే కుమారుడు వేధించడం ప్రారంభించాడు.
మార్గమధ్యలో ఇద్దరు, మరొక ముగ్గురు పెద్దమ్మతల్లి ఆలయం పక్కన ఖాళీ స్థలంలో అఘాయిత్యానికి ఒడిగట్టారు. తన ఫ్రెండ్స్ బలవంతం కారణంగానే తానూ ఈ అత్యాచారం చేయాల్సి వచ్చిందని పోలీసులకు తెలిపాడు. వారి ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందని సాదుద్దీన్ పోలీసుల ముందు తెలిపాడు. ఇదిలా ఉంటే పబ్ కేసులోని నిందితుల మధ్య ఘర్షణ జరిగింది. జువైనల్ హోంలో ఉన్న ఐదుగురు మైనర్లు ప్లేట్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. శాస్త్రిపురం కార్పొరేటర్ కుమారుడు సాదుద్దీన్ టార్గెట్‌గా ఈ దాడి జరిగింది. నీ వల్లే విషయం బయటకు వచ్చిందని సాదుద్దీన్‌పై మిగతా నిందితులు దాడి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.