హోమ్ /వార్తలు /సినిమా /

Sonu Sood : ప్రభాస్, రామ్ చరణ్, సమంతలు అటువైపు వెళ్తుంటే.. సోనూ మాత్రం ఇటు వస్తున్నారు...

Sonu Sood : ప్రభాస్, రామ్ చరణ్, సమంతలు అటువైపు వెళ్తుంటే.. సోనూ మాత్రం ఇటు వస్తున్నారు...

Sonu sood Photo : Instagram

Sonu sood Photo : Instagram

Sonu Sood : సోనూసూద్ గురించి ప్రత్యేక పరిచయం చేయనక్కరలేదు. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్ ప్రజలకు అండగా నిలిచి హీరో అయ్యారు.

  సోనూసూద్ గురించి ప్రత్యేక పరిచయం చేయనక్కరలేదు. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్ ప్రజలకు అండగా నిలిచి హీరో అయ్యారు. కరోనా లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులపాలైన సామాన్యులకు అండగా నిలిచి గొప్ప మనసున్న నటుడుగా గుర్తింపు పొందారు సోనూ.. అలా సూపర్ హీరో అయ్యారు. లాక్ డౌన్ సమయంలో ముఖ్యంగా వలసకూలీలకు తోడుగా నిలిచి వారి తమ స్వస్థలాలకు చేర్చాడు. ఇక అప్పటినుండి ఆయన పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. ఇక అప్పటినుండి ఆయన అవసరమున్న వారికి నిరంతరం సహాయం చేస్తూనే ఉన్నారు. అది అలా ఉంటే ఆయన గతంలో ముంబైలో ఉండేవారు. కానీ తాజాగా హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొన్నారట. ప్రస్తుతం తెలుగులో సోనూకి చాలా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో అతను ఎక్కువ కాలం హైద‌రాబాద్ లో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో సోను ఓ ఇల్లు కొనుగోలు చేసినట్టు తాజా సమాచారం. గతంలో షూటింగ్ నిమిత్తం హైద‌రాబాద్‌కు ఎప్పుడు వచ్చినా సోనూ పార్క్ హ‌య‌త్‌లో బస చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత ఇల్లు కొన్నారని టాక్.


  అందులో భాగంగా సోనూ సూద్ బంజారా హిల్స్‌లో.. రూ.10 కోట్ల‌తో ఓ ఖ‌రీదైన ఇంటిని కొనుగోలు చేసారట. దీనికి సంబంధించి త్వర‌లోనే గృహ ప్ర‌వేశం వేడుక కూడా జరుగబోతున్నట్టు తెలుస్తోంది. సోనూకు ముంబైలో కూడా ఓ విలాసవంతమైన ఇల్లు ఉంది. ఇక్కడ మరో విషయం ఏమంటే.. మన తెలుగు హీరోలు కొందరమే రివర్స్‌గా హైదరాబాద్‌ నుంచి ముంబైకి వెళ్తున్నారు. అందులో భాగంగానే ముంబైలో ఇళ్లు, ప్లాట్‌లు కొనేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ముంబైలో ఇళ్లు తీసుకోగా, రామ్ చరణ్ దంపతులు సైతం ఇటీవల ముంబైలో ఫ్లాట్ కొన్నారు. ఇక ‘ఫ్యామిలీ మ్యాన్2’ వెబ్ సిరీస్‌ హిట్ అవ్వడంతో సమంతకు కూడా అక్కడ అవకాశాలు  వస్తున్నాయి. దీంతో ఆమె కూడా ముంబైలో ప్లాట్ తీసుకుంటున్నారట.

  View this post on Instagram


  A post shared by Sonu Sood (@sonu_sood)  ఇక సోనూ సూద్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న ఆచార్యలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. రామ్ చరణ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో సోనూ సూద్ విలన్ పాత్రలో కనిపించనున్నాడని టాక్.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Ram Charan, Samantha Ruth Prabhu, Sonu Sood, Tollywood news

  ఉత్తమ కథలు