• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SONG SHOOT FOR PRABHAS RADHE SHYAM IN HYDERABAD MHN

Prabhas: వామ్మో... ప్రభాస్‌కి అంత మంది ఎక్క‌డ దొరికార‌బ్బా..!

Prabhas: వామ్మో... ప్రభాస్‌కి అంత మంది ఎక్క‌డ దొరికార‌బ్బా..!

Song Shoot For Prabhas Radhe Shyam in Hyderabad

Prabhas - Radhe Shyam: ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్‘ పాట చిత్రీకరణ జరుగుతోంది..

  • Share this:
    కొన్ని విష‌యాలు తెలిసిన‌ప్పుడు ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది. ఇదిగో ఇప్పుడు ప్ర‌భాస్ విష‌యంలో ప్ర‌చారంలో ఉన్న విష‌యాలు విన్న‌ప్పుడు కూడా అంద‌రూ అలాగే నోరెళ్ల‌బెడుతున్నారు. ఇంత‌కీ విష‌యం డాన్సింగ్ గురించి!. డార్లింగ్ అంత ఎత్తున్నా, డ్యాన్సుల్లో ఎప్పుడూ వెన‌క‌ప‌డ‌లేదు. ఆ మాట‌కొస్తే ఒక‌డుగు ముందుకేసి మ‌రీ స్టెప్పులు ఇర‌గ‌దీసిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. మ‌రి అంత గొప్ప డ్యాన్సర్ చేతిలో ఉన్న‌ప్పుడు ఏదో ఒక స్పెషాలిటీని త‌న సినిమాలో చూపించాల‌నుకున్నార‌ట డైర‌క్ట‌ర్ రాధేశ్యామ్‌.
    అనుకున్న‌దే త‌డ‌వుగా ఆలోచ‌న‌ను యువీ క్రియేష‌న్స్ తో షేర్ చేసుకున్నారు. వెంట‌నే వాళ్లు కూడా త‌ల ఊపేశారు. ప్యాన్ ఇండియా రేంజ్‌లో హ‌ల్‌చ‌ల్ చేయాలంటే ఆ మాత్రం హంగామా ఉండాల్సిందేన‌ని అనుకున్నారు. అంతే వెంట‌నే ముంబైతో పాటు నార్త్ ఇండియాలోని బోలెడ‌న్ని ప్లేసెస్ నుంచి డ్యాన్స‌ర్ల‌ను దించేశారు.

    ఏం మ‌న ద‌గ్గ‌ర డ్యాన్స‌ర్లు లేరా? అని అనుకుంటున్నారా? డ్యాన్స‌ర్లు లేక కాదు... ఇటాలియ‌న్ డ్యాన్స‌ర్లు లేరు. సో అందుకే ఇటాలియ‌న్ లుక్స్ తో ఉన్న‌వాళ్ల‌ను చాలా వ‌ర‌కు ర‌ప్పించేశారు. కాస్త రంగుతో మ్యాచ్ అయ్యే వాళ్ల‌ను వెనుక వ‌రుస‌ల్లో నిల‌బెడుతున్నారు. టోట‌ల్‌గా ఈ ఇటాలియ‌న్ సాంగ్ కోసం వేసిన ఇటాలియ‌న్ వింటేజ్ సెట్‌లో 350 మందికి పైగా డ్యాన్స‌ర్లు డార్లింగ్‌తో పాటు కాలు క‌దుపుతున్నారు.

    ఇప్ప‌టికే ఈ సినిమా అప్‌డేట్ కోసం డైర‌క్ట‌ర్‌ని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్ సంక్రాంతి వ‌ర‌కైనా ఓర్చుకుంటారో, లేకుంటే సోష‌ల్ మీడియా సాక్షింగా త‌మ ప్ర‌తాపాన్ని మ‌రోసారి చూపిస్తారో చూడాలి. ఏదేమైనా 350 మంది ఇటాలియ‌న్ డ్యాన్స‌ర్ల మ‌ధ్య ప్ర‌భాస్ వేసే స్టెప్పులు త‌ల‌చుకుంటే మాత్రం ఫ్యాన్స్ కి పూన‌కాలు వ‌చ్చేస్తున్నాయ‌న్న‌ది నిజం.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు