మార్వెల్(Marvel) ఫాన్స్ ఇటు.. స్పెడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా స్పైడర్ మ్యాన్- నో వే హోమ్ (Spider Man No way Home). ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ (Trailer)ను మార్వెల్, సోసిపిక్చర్ (Soney Pictures) సంయుక్తంగా విడుదల చేశాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ రాగా ట్రైలర్ ఫ్యాన్స్‌కు అంచనాలు పెంచేసిందనడంలో సందేహం లేదు. మార్వెల్ నుంచి వస్తున్న మూడో సినిమా 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్. జాన్ వాట్స్ దర‍్శకత్వం వహించిన ఈ చిత్రంలో టామ్ హోలాండ్, జెండీయా, బెనెడిక్ట్ కంబర్‌బ‍్యాచ్, విలియమ్ డాఫే, జేమీ ఫాక్స్, ఆల్ఫ్రెడ్ మొలీనా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మీద ఇప్పటికే విపరీతమైన అంచానాలు పెరిగి కథ ఎలా ఉంటుందో అని జనం కొత్త కొత్త థియరీలతో య్యూట్యూబ్‌లో వీడియోలు పెడుతున్న నేపథ్యంలో..
చిత్ర బృదం కథపై పూర్తి అంచనా వచ్చేలా ట్రైలర్ రిలీజ్ చేయడం సాహసం అనే చెప్పాలి. లేదా ఎక్కువ అంచనాలతో సినిమాకు ఇబ్బంది కాకుండా ఉండాలని కథను ముందే చెప్పి ఉండవచ్చని స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
We started getting visitors… from every universe. Watch the official trailer for #SpiderManNoWayHome, exclusively in movie theaters December 17.
Tickets on sale C̶y̶b̶e̶r̶ Spider-Monday, November 29. @SpiderManMovie pic.twitter.com/TrjjRPnPnX
— Sony Pictures (@SonyPictures) November 17, 2021
ఏం ఉంది ట్రైలర్‌లో..
స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అందరకీ తెలిసి పోతుంది. ఈ నేపథ్యంలో తనతో ఉన్నవారు ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్య నుంచి బయట పడడానికి డాక్టర్ స్ట్రేంజ్ సాయం కోరుతాడు.
ప్రత్యేక మంత్రంతో అందరినీ తాను స్పైడర్ మ్యాన్ అని మర్చిపోయేలా చేయమని కోరుతాడు. దీనికి డాక్టర్ స్ట్రేంజ్ ఒప్పుకొంటాడు. అయితే దాని వల్ల వచ్చే దుష్పరిణామాలతో సమాంతర భూగ్రహాల నుంచి స్పైడర్ శత్రువులు భూమిపైకి వస్తారు. వారిని ఎలా ఎదుర్కొంటూ స్రైడర్ మ్యాన్ చేసే సాహసాలకు సంబంధించిన సీన్స్‌ను చూపించారు.
గతంలో స్పైడర్ మ్యాన్ పాత్ర పోషించిన టూబే మాగ్యూర్, ఆండ‍్య్రూ గారీఫీల్డ్ కూడా వీరిని ఎదరించడానికి వస్తున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి సీన్‌లు లేకున్నా.. హింట్ మాత్రం ఇచ్చారు. డాక్టర్ ఆక్టోపస్ స్రైడర్ మ్యాన్ ని పట్టుకొని "యూ ఆర్ నాట్ పీటర్ పార్కర్" అంటాడు. అంతే కాకుండా సాండ్ మ్యాన్, ఎలక్ట్రోలను, కూడా ఫైట్‌లో చూపించారు. ఈ నేపథ్యంలో స్పైడర్ మ్యాన్, అమేజింగ్ స్పైడర్ మ్యాన్ చిత్రాల్లో లీడ్ రోల్ చేసిన టూబే మాగ్యూర్, ఆండ‍్య్రూ గారీఫీల్డ్ ఉంటారని ఫ్యాన్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముగ్గురు కలిసి ఒకేసారి కనపడాలని కోరుకుంటూ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ వీడియోలు చేస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్ ఒక విజువల్ వండర్‌గా సాగింది. యాక్షన్ సన్నివేశాలు సూపర్‌గా ఉన్నాయి. కచ్చితంగా ఫ్యాన్స్ థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా డిసెంబర్ 17, 2021న థియేటర్లోకి రానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hollywood, Instagram, Telugu movies, Twitter