హోమ్ /వార్తలు /సినిమా /

Spider Man No way Home : అంచ‌నాలు పెంచేస్తున్న పోస్ట‌ర్‌.. డిసెంబ‌ర్‌లో థియేట‌ర్‌ల‌లోకి స్పైడర్‌ మ్యాన్‌ - నో వే హోమ్

Spider Man No way Home : అంచ‌నాలు పెంచేస్తున్న పోస్ట‌ర్‌.. డిసెంబ‌ర్‌లో థియేట‌ర్‌ల‌లోకి స్పైడర్‌ మ్యాన్‌ - నో వే హోమ్

స్పైడర్‌ మ్యాన్‌- నో వే హోమ్ (ఫోటో క్రెడిట్ - మార్వెల్ ఇన్‌స్టాగ్రామ్)

స్పైడర్‌ మ్యాన్‌- నో వే హోమ్ (ఫోటో క్రెడిట్ - మార్వెల్ ఇన్‌స్టాగ్రామ్)

Spider Man No way Home : మార్వెల్(Marvel) ఫాన్స్ ఇటు.. స్పెడ‌ర్ మ్యాన్  ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా స్పైడర్‌ మ్యాన్‌- నో వే హోమ్ (Spider Man No way Home). ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌న్‌ను చిత్ర బృందం అధికారికంగా విడుద‌ల చేసింది. ఈ సినిమా డిసెంబ‌ర్ 17, 2021న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

ఇంకా చదవండి ...

  మార్వెల్(Marvel) ఫాన్స్ ఇటు.. స్పెడ‌ర్ మ్యాన్  ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా స్పైడర్‌ మ్యాన్‌- నో వే హోమ్ (Spider Man No way Home). ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌న్‌ను చిత్ర బృందం అధికారికంగా విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌ను సోనీ పిక్చర్స్‌, మార్వెల్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా విడుద‌ల చేశాయి. ట్విట్ట‌ర్‌ (Twitter), ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో పోస్ట‌న్‌ను ఆయా సంస్థ‌ల త‌మ సోష‌ల్‌మీడియా (Social Media) ఖాతాల్లో విడుద‌ల చేశాయి. ఈ పోస్టర్‌లో డాక్టర్‌ ఆక్టోపస్‌ (Octopus)ను చూపించకున్న తన మెటల్‌ అవయవాలు పీటర్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ త‌ర‌హా చిత్రాల‌ను ట్రైల‌ర్‌లో చూసిన‌ప్ప‌టికీ పోస్ట‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకొనేలా తీర్చిదిద్దారు.  పోస్టర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రీన్‌ గాబ్లిన్‌ (విలియమ్‌ డాఫో) తన ఐకానిక్‌ గ్లైడర్‌పై రైడ్‌ చేయడం చూడొచ్చు. పోస్టర్‌లో ‘ఎలక్ట్రో’ తోపాటు డాక్టర్ ఆక్టోప‌స్ కూడా క‌నిపిస్తున్నాడు. ట్రైల‌ర్ అంచానా ప్ర‌కారం సాండ్ మ్యాన్‌, కూడా ఉండ‌వ‌చ్చ‌నే ఫ్యాన్స్ ఊహిస్తున్నారు.


  ఇప్ప‌టికే ట్ర‌యిల‌ర్ భారీ స్థాయిలో అంచ‌నాల‌ను పెంచేసింది. స్పైడ‌ర్ మ్యాన్ ఏదో కేసులో చిక్కుకోవ‌డం.. త‌నే స్పైడ‌ర్ మ్యాన్ అని ప్ర‌పంచానికి తెలిసిపోయిన‌ట్టు ట్ర‌యిల‌ర్‌లో చూపించారు. దీంతో స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌డానికి స్పైడ‌ర్ మ్యాన్ డాక్ట‌ర్ స్ట్రేంజ్ ను ఆశ్ర‌యిస్తాడు.


  ప్ర‌మాద‌క‌ర‌మైన మంత్రోశ్చ‌ర‌ణ‌తో జ‌రిగింద‌తా మారుతుంద‌ని చెబుతాడు. కానీ ఆ మంత్రం కొత్త స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తుంద‌ని ట్ర‌యిల‌ర్‌లో చూపించారు. ఇప్ప‌టికే ఫేస్‌బుక్‌, యూట్యూబుల్లో ఫ్యాన్ బేస్డ్ స్టోరీలు హ‌ల్ చల్ చేస్తున్నాయి.  దీంతో సిన‌మా విడుద‌ల‌పై భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి డిసెంబ‌ర్ 17, 2021 న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Hollywood, Instagram, Twitter

  ఉత్తమ కథలు