Home /News /movies /

SONAM KAPOOR TROLLING NETIZENS WHO SHARED SONAM KAPOOR BIRTHDAY VIDEO SNR

Bollywood: ఏంటీ పిల్ల చేష్టలు ..సోనమ్‌కపూర్ బర్త్‌ డే వీడియోపై ట్రోలింగ్

(Photo Credit:Instagram)

(Photo Credit:Instagram)

Sonam Kapoor: బాలీవుడ్‌ స్టార్ కిడ్ సోనమ్‌కపూర్‌ బర్త్‌ డే సందర్భంగా వీడియో, ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. సోనమ్‌కపూర్‌ గర్భిణిగా ఉండి భర్తను తీసుకొని నడిరోడ్డుపై ముద్దులు పెట్టుకోవడం ఏమాత్రం మంచిగా లేదంటున్నారు ఫ్యాన్స్.

ఇంకా చదవండి ...
సినిమా వాళ్లు అంటేనే గ్లామర్ ప్రపంచంలో విహరించే వాళ్లని ఓ పేరుంది. జనం తమవైపు చూడాలని...తాము చేస్తున్నది అందరూ చూడాలని కాస్త శృతి మించి ప్రవర్తిస్తుంటారు. సినిమాల్లో పాత్రల్లోంచి షూటింగ్‌ అయిన తర్వాత బయటకు వచ్చినప్పటికి రియల్‌ లైఫ్‌(Real life)లో మాత్రం ఆ స్థాయిలో తమ ఆనందాలు, అనుభవాల్ని అందరితో షేర్ చేసుకోవాలని ముచ్చటపడుతూ ఉంటారు. ఈ తరహా సంస్కృతి బాలీవుడ్‌(Bollywood)‌లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పుట్టిన రోజులైనా, పెళ్లి రోజులైనా శ్రీమంతం కార్యక్రమం అయినా వినూత్నంగా చేసి విమర్శలకు గురవుతూ ఉంటారు. బాలీవుడ్ స్టార్ కిడ్ సోనమ్‌కపూర్‌ వంతు వచ్చింది. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న సోనమ్‌కపూర్(Sonam Kapoor)తన బర్త్‌ డే సందర్భంగా భర్త ఆనంద్‌ అహుజా(Anand Ahuja)ను వెంట వేసుకొని రోడ్లపై సరదాగా తిరుగుతూ అతనికి ముద్దులు పెట్టింది. ఈ తతంగం అంతా చాలదంటూ ఆ వీడియోని, ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో షేర్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో, ఫోటోలే తెగ వైరల్ అవుతున్నాయి.

వైరల్‌ అవుతున్న సోనమ్‌ వీడియో..
సోనమ్‌కపూర్‌ షేర్ చేసిన బర్త్‌ డే వీడియో, ఫోటోలను చూసిన ఫాలోవర్స్ విషెస్ చెబుతున్నారు. కాని ఇంకొందరు మాత్రం ఇద్దరూ భార్యభర్తలే కదా రోడ్డు మీద ఏంటీ ఆరాచకం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. బ్లూ కలర్ స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్ బ్లూ కలర్‌ ప్యాంట్ వేసుకున్న సోనమ్‌కపూర్‌ వైట్‌ కోట్‌ లాంటి షర్ట్ పైన వేసుకుంది. ప్రస్తుతం నల్ల కళ్లజోడు పెట్టుకొని భర్తతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోని షేర్ చేసింది. చూడటానికి కాస్త ఎబ్బెట్టుగా ఉన్న ఈ వీడియో, ఫోటోలను చూసి నువ్వు ప్రెగ్నెంట్‌వేనా అని కొందరు మరికొందరు లైక్‌ల కోసమేనా ఈ ఓవర్ యాక్షన్ అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.




అలవాటుగా మారింది..
బర్త్ డే సందర్భంగా సోనమ్‌ కపూర్ చేస్తుంది కాస్త ఎక్స్‌ట్రాగా ఫీలవుతున్నారు నెటిజన్లు. అయితే బాలీవుడ్‌లో ఇదేం కొత్త కాదు. మొన్న రణబీర్‌కపూర్ ఆలియాభట్‌ పెళ్లి రోజున జంటగా అందరి ముందుకు వచ్చిన ఇద్దరూ అందరి ముందే ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్‌ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్‌ కూతురు బర్త్‌ డే సందర్భంగా స్విమ్మింగ్‌ డ్రెస్‌లో కేక్ కట్ చేసింది.

ఇది చదవండి : ఘనంగా ముస్తాబైన పెళ్లి వేడుక.. ఈ లగ్జరీ హోటల్ ఖర్చు ఎంతో తెలుసా?


ఇదెక్కడి విడ్డూరం..
వీడియోలు, ఫోటోలు వైరల్ కావడానికే అన్నట్లుగా సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో మల్లికాషెరావత్, జాన్వీకపూర్ లాంటి స్టార్‌ హీరోయిన్లను రోజు విమర్శిస్తూనే ఉంటారు నెటిజన్లు. అయితే వాళ్లు ఇలాంటివేమి పట్టించుకోకుండా అదే పద్దతిని కంటిన్యూ చేస్తుండటం..ఒకరిని చూసి మరొకరు వింత వింత వీడియోలు షేర్ చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Bollywood heroine, Sonam kapoor, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు