హోమ్ /వార్తలు /సినిమా /

బ్రిటీష్ ఎయిర్‌వేస్‌‌పై బాలీవుడ్ బ్యూటీ ఆగ్రహం..ఏం జరిగిందంటే?

బ్రిటీష్ ఎయిర్‌వేస్‌‌పై బాలీవుడ్ బ్యూటీ ఆగ్రహం..ఏం జరిగిందంటే?

Instagram

Instagram

నెల రోజుల వ్యవధిలో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ మూడుసార్లు బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానాల్లో ప్రయాణించగా...రెండుసార్లు తన బ్యాగులను పోగొట్టారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తంచేసింది.

బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానాల్లో ఇక తానెప్పుడూ ప్రయాణించబోనంటూ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఆగ్రహం వ్యక్తంచేసింది. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌పై ఆమె కోపానికి కారణం లేకపోలేదు. గత నెల రోజుల్లో బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానాల్లో మూడు సార్లు ప్రయాణించిన సోనమ్...రెండు సార్లు తన బ్యాగులను పోగొట్టుకుంది. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌ విమానాల్లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్‌ ద్వారా పంచుకుంది ఈ 34 ఏళ్ల బాలీవుడ్ బ్యూటీ. గత నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానాల్లో ప్రయాణిస్తే...రెండుసార్లు తన బ్యాగులను పోగొట్టారని మండిపడింది.  తగిన గుణపాఠం నేర్చుకున్నానని...ఇక బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానాల్లో ప్రయాణించకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది.

సోనమ్‌కి ఎదురైన అసౌకర్యం పట్ల బ్రిటీష్ ఎయిర్‌వేస్ విచారం వ్యక్తంచేసింది. లగేజీ వివరాలను విమానాశ్రయంలో ఇచ్చారా? అని ప్రశ్నించగా...వివరాలు ఇచ్చినా ప్రయోజనం లేకుండాపోయిందని సోనమ్ తెలిపింది. దీంతో తాను తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు అసంతృప్తి వ్యక్తంచేసింది. మీ సేవలు దారుణంగా ఉన్నాయంటూ సోనమ్ మండిపడింది.

గత నెల బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో తాను కూడా లగేజీ కోల్పోయానని, ఆ తర్వాత వారు కొరియర్ ద్వారా లగేజీని ఇంటికి పంపినట్లు మరో బాలీవుడ్ నటి పూజా హెగ్డే ట్వీట్ చేసింది.

First published:

Tags: Bollywood heroine, Sonam kapoor

ఉత్తమ కథలు