విద్యావంతులే విడాకుల వైపు మొగ్గుచూపుతున్నారంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తెలివి తక్కువ, వెనుకబాటు మాటలు ఎలా మాట్లాడతారంటూ ఆమె ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్.. ఉన్నత విద్యావంతులు, ధనవంతుల కుటుంబాల్లోనే ఎక్కువగా విడాకుల కేసులు నమోదవుతున్నాయన్నారు. విద్య, డబ్బుతో పొగరుబట్టిన కారణంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అభిప్రాయపడ్డారు. దాంతో కుటుంబాలు విచ్ఛిన్నం అమవుతున్నాయన్నారు. దీంతో సమాజంలో కూడా అంతరాలు పెరిగిపోతున్నాయని మోహన్ భగవత్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మోహన్ భగవత్ వ్యాఖ్యలపై సోనం కపూర్ ట్విటర్ వేదికగా స్పందించారు. నేరుగా మోమన్ భగవత్ పేరును ప్రస్తావించకుండా... ఇవి పూర్తిగా తెలివితక్కువ, వెనుకబాటుతనాన్ని సూచించే మాటలంటూ ఎద్దేవా చేశారు. ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ మండిపడ్డారు.