Sonam Kapoor : నేను ప్రెగ్నెంట్ కాదు.. అర్థం చేసుకోండి.. సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరోయిన్..

Sonam Kapoor Photo : Twitter

Sonam Kapoor : సోనమ్ కపూర్ పరిచయం అక్కరలేని అందాల హిందీ నటీ. సోనమ్ తండ్రి అనిల్ కపూర్ నట వారసత్వాన్ని ఒంట బట్టించుకొని సినిమాల్లో కొన్ని సంవత్సరాలు బాగానే రాణించింది.

  • Share this:
    Sonam Kapoor : సోనమ్ కపూర్ పరిచయం అక్కరలేని అందాల హిందీ నటీ. సోనమ్ తండ్రి అనిల్ కపూర్ నట వారసత్వాన్ని ఒంట బట్టించుకొని సినిమాల్లో కొన్ని సంవత్సరాలు బాగానే రాణించింది. ఆ మధ్య సోనమ్ ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని సినిమాలను తగ్గించి వేసింది. సోనమ్ చివరగా చేసిన చెప్పుకోదగ్గ సినిమా అంటే... 'నీరజ', అంతేకాకుండా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన 'సంజు'లో కూడా నటించి మెప్పించింది. అది అలా ఉంటే సోనమ్‌ కపూర్‌ అహుజా ఏ విషయాన్నైనా ఖచ్చితంగా, కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంది. తాజాగా మరోసారి ఓ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. వివరాల్లోకి వెళితే... సూపర్ స్టైలీష్ దుస్తుల్లో మెరిసే సోనమ్ తన ఫ్యాషన్ సెన్స్ స్టైలింగ్ కారణంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంటారు. ఆ మధ్య సోనమ్ కపూర్ లండన్ నుండి ముంబైకి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో వదులుగా ఉండే డ్రెస్‌తో కనిపించారు. దీంతో ఆమె అభిమానులతో పాటు నెటిజన్స్ ఆమె ఫోటోలపై రకరకాల కామెంట్స్ చేశారు. అందులో ముఖ్యంగా ఆమె గర్భం ధరించిందని అందులో భాగంగానే అలాంటీ డ్రెస్ ధరించారని ఊహాగానాలు చేశారు. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

    ఈ నేపథ్యంలో సోనమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియాలో రాస్తూ.. బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో తనకు పీరియడ్స్‌ వచ్చినట్లు స్పష్టం చేసింది. 'పీరియడ్స్‌ మొదటి రోజున వేడి నీళ్లు, అ‍ల్లం టీ తాగుతున్నాను' అని క్లారిటీ ఇచ్చింది. దీంతో ప్రెగ్నెంట్ అనే రూమర్లకు చెక్‌ పెట్టినట్లైంది. ఇక సోనమ్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె బ్లైండ్ అనే సినిమాలో నటిస్తుంది.
    Published by:Suresh Rachamalla
    First published: