డబ్బుల కోసమే సినిమాల్లోకి వచ్చాను.. సోనాలి బింద్రే సంచలన వ్యాఖ్యలు..

Sonali Bendre | డబ్బుల కోసమే నేను సినిమాల్లోకి వచ్చాను.. సోనాలి బింద్రే చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారింది. ఈమె విషయానికొస్తే.. 

news18-telugu
Updated: January 25, 2020, 6:29 PM IST
డబ్బుల కోసమే సినిమాల్లోకి వచ్చాను.. సోనాలి బింద్రే సంచలన వ్యాఖ్యలు..
సోనాలి బింద్రే ఫైల్ ఫోటో
  • Share this:
డబ్బుల కోసమే నేను సినిమాల్లోకి వచ్చాను.. సోనాలి బింద్రే చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారింది. ఈమె విషయానికొస్తే.. అప్పట్లో మహేష్ బాబు హీరోగా నటించిన ‘మురారి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముంబాయి భామ సోనాలి బింద్రే. ఆ తర్వాత ‘ఇంద్ర’, ‘ఖడ్గం’, ‘మన్మథుడు’, ‘పలనాటి బ్రహ్మనాయుడు’, ‘శంకర్ దాదా ఎం.బీ.బీ.ఎస్’ వంటి సినిమాలతో సోనాలి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పిన ఈ ముంబై ముద్దుగుమ్మ తనకు వచ్చిన  క్యాన్సర్ వ్యాధి గురించి చెప్పి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇక క్యాన్సర్ చికిత్స కోసం ఆమె న్యూయార్క్ వెళ్లి కొన్ని నెలల పాటు కాన్సర్‌కు చికిత్స తీసుకుని భారత దేశానికి తిరిగొచ్చిన సంగతి  తెలిసిందే కదా. తాజాగా ఈమె ఓ విలేఖరులు సమావేశంలో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలను మీడియాతో పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను డబ్బులు సంపాదించడానికే సినిమాల్లోకి వచ్చానంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.

Sonali bendre says that She was never thought about her death due to cancer attack,గతేడాది తనకు వచ్చిన  క్యాన్సర్ వ్యాధి గురించి చెప్పి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇక క్యాన్సర్ చికిత్స్ కోసం ఆమె న్యూయార్క్ వెళ్లి కొన్ని నెలల పాటు కాన్సర్‌కు చికిత్స తీసుకుని భారత దేశానికి తిరిగొచ్చిన సంగతి  తెలిసిందే కదా. తనకు వచ్చిన క్యాన్సర్ సోకినపుడు చనిపోతానని ఎపుడు అనుకోలేదని చెప్పింది. sonali bendre,sonali bendre cancer,sonali bendre movies,sonali bendre family,sonali bendre husband,sonali bendre cancer news,sonali bendre songs,sonali bendre lifestyle,sonali bendre biography,sonali bendre latest news,sonali bendre high grade cancer,sonali bendre news,sonali bendre new york,sonali bendre cancer treatment,sonali bendre diagnosed with cancer,sonali bendre ill,sonali bendre health,bollywood News,Hindi cinema,Tollywood News,Telugu cinema,సోనాలి బింద్రే,సోనాలి బింద్రే క్యాన్సర్,సోనాలి బింద్రే క్యాన్సర్ చికిత్స,సోనాలి బింద్రే తెలుగు సినిమాలు,హిందీ సినిమాలు,
సోనాలి బింద్రే (ఫైల్ ఫోటో)


సినిమా నా జీవితాన్నే మార్చివేసింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నేను.. ఇపుడీ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం సినిమాలే. అవి లేకపోతే.. నేనక్కడ ఉండేదాన్నో అంటూ ఒకింత భావోద్వేగానికి లోనైంది. ఈ సందర్భంగా నేను బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పుకొచ్చింది. ఇక సినిమాల తర్వాత తనకు పుస్తకాలంటే చాలా ఇష్టమని చెప్పింది. వాటి నుంచి నేను ఎంతో జ్ఞానాన్ని పొందానన్నారు. ఇక చికిత్స కోసం అమెరికాలోని న్యూయార్క్ వెళ్లినపుడు ‘ఏ జెంటిల్మెన్ ఇన్ మాస్కో’ అనే పుస్తకం నాలో ఎంతో ధైర్యాన్ని నింపిందని సోనాలి వివరించారు.

First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు