జులాయి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది.. అది అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆశ క్యాన్సర్ ఉన్నోడిని కూడా బతికిస్తుంది.. భయం అల్సర్ ఉన్నోడిని కూడా చంపేస్తుందని. ఈ మాట ఇప్పుడు కొందరు ప్రముఖులు నిజం చేసి చూపించారు. బతకాలన్న వాళ్ళ ఆశే క్యాన్సర్‌ను జయించి మళ్లీ మన ముందుకొచ్చేలా చేసింది. అలాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.
జులాయి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది.. అది అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆశ క్యాన్సర్ ఉన్నోడిని కూడా బతికిస్తుంది.. భయం అల్సర్ ఉన్నోడిని కూడా చంపేస్తుందని. ఈ మాట ఇప్పుడు కొందరు ప్రముఖులు నిజం చేసి చూపించారు. బతకాలన్న వాళ్ళ ఆశే క్యాన్సర్‌ను జయించి మళ్లీ మన ముందుకొచ్చేలా చేసింది. అలాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. క్యాన్సర్ అనేది మహమ్మారి. ఎప్పుడు ఏ వయసులో వస్తుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. కొన్నేళ్ల నుంచి చాలా మంది ప్రముఖులు క్యాన్సర్ బారిన పడ్డారు. ఒక్కరో ఇద్దరో కాదు.. ఇప్పటికీ చాలా మంది ఆ మహమ్మారి బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు.
Being back on a set after a major sabbatical – one that’s been testing in many ways on many levels – is a surreal feeling. After all this, I sort of feel an additional sense of purpose & meaning & I'm so grateful to be back in action #SwitchOnTheSunshinehttps://t.co/hFuZk6jKeM
తాజాగా సోనాలి బింద్రే కూడా అదే స్థితి నుంచి బయటికి వచ్చింది. మానసిక స్థైర్యంతో ఎంతో ధైర్యంగా నిలబడి క్యాన్సర్ నుంచి బయట పడింది ఈ ముద్దుగుమ్మ. చాలా రోజుల నుంచి విదేశాల్లోనే ట్రీట్మెంట్ తీసుకుని ఇప్పుడు కెమెరా ముందుకొచ్చింది సోనాలి. తాజాగా ఈమె నటిస్తున్న సినిమా సెట్స్ పై ఉంది. ఇదే విషయాన్ని చెబుతూ తన ఆనందాన్ని పంచుకుంది సోనాలి. ఇదంతా ఓ కలలా అనిపిస్తోందంటూ చెప్పుకొచ్చింది సోనాలి. మళ్లీ కెమెరా ముందుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
క్యాన్సర్ సెలబ్రెటీస్
ఈమె కంటే ముందు ఇంకా చాలా మంది ఇలా క్యాన్సర్ బారిన పడ్డారు. బాలీవుడ్లో ముఖ్యంగా మహేష్ బాబు టక్కరి దొంగ హీరోయిన్ లీసా రే క్యాన్సర్ బారిన పడి ప్రాణాలతో పోరాడింది. చాలా రోజులు ట్రీట్మెంట్ తర్వాత ఆమె మళ్లీ మామూలు మనిషి అయింది. ఇక ఆమెతో పాటు మనీషా కోయిరాలా కూడా చాలా రోజుల పాటు క్యాన్సర్ మహమ్మారితో పోరాడింది. కమల్ మాజీ భార్య గౌతమి కూడా కొన్నేళ్ల పాటు క్యాన్సర్ బారిన పడింది. ఆమె కూడా ప్రాణాలకు తెగించి క్యాన్సర్ యుద్ధంలో గెలిచింది.
క్యాన్సర్ సెలబ్రెటీస్
సింగర్ కమ్ యాక్టర్ మమతా మోహన్ దాస్ కూడా కొన్నేళ్లు క్యాన్సర్ తో పోరాడింది. ఇక బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కూడా ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈయన కొన్ని నెలలుగా లండన్ లోనే ఆస్పత్రిలో ఉన్నాడు. అక్కడే మరికొన్ని రోజులు ఉండాల్సి వచ్చేలా ఉంది. మొత్తానికి క్యాన్సర్ సోకినా.. కణాలు శరీరాన్ని తినేస్తున్నా కూడా మానసిక స్థైర్యంతో నిలబడి వాళ్లంతా దాన్ని గెలిచి మళ్లీ కెమెరా ముందుకొచ్చారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.