ప్రభాస్ సినిమాలో బాలయ్య భామ సోనాల్ చౌహాన్ (File/Photo)
Prabhas - Sonal Chauhan : నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెజెండ్’ మూవీతో పరిచమైన సోనాల్ చౌహాన్.. ఈ సినిమా సక్సెస్ సాధించిన సరైన అవకాశాలు మాత్రం రాలేదు. ఆ తర్వాత బాలయ్య సరసన డిక్టేటర్, లయన్ సినిమాల్లో నటించింది. తాజాగా ఈ భామ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబోలో వస్తోన్న ‘ది ఘోస్ట్’లో కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ భామ ప్రభాస్ మూవీలో నటించినట్టు వెల్లడించింది.
Prabhas - Sonal Chauhan : ప్రభాస్ సినిమాలో సోనాల్ చౌహాన్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాలయ్య భామ.. వివరాల్లోకి వెళితే.. రెబల్ స్టార్ ప్రభాస్రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’(Bahubali) సినిమాలతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో ప్రభాస్ వరుసగా అన్ని ప్యాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ సినిమా తెలుగులో పెద్దగా అలరించకపోయినా.. నార్త్ రీజియన్‌లో ఇరగదీసింది. రీసెంట్గా ప్రభాస్ ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) అనే సినిమాతో పలకరించారు. మార్చి 11న విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్లో మరో డిజాస్టర్‌గా నిలిచింది. ఇక అది అలా ఉంటే ఆయన నటిస్తున్న మరో ప్యాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ (Adipurush). ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీటైంది.
ఆదిపురుష్ (Adipurush) చిత్రం ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించబడింది. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించారు.. సీతాదేవిగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ .. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నారు. తాజాగాఈ సినిమాలో బాలయ్య భామ సోనాల్ చౌహాన్ కూడా ముఖ్యపాత్రలో నటించినట్టు తాజాగా మీడియాకు వెల్లడించింది. ఆ పాత్ర ఏమిటనేది సస్పెన్స్ అని చెబుతోంది. ఐతే.. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్.. రావణాసురుడి భార్య అయిన మండోదరి పాత్రలో నటించిందా లేకపోతే.. లక్షణుడి భార్య అయిన ఊర్మిళ పాత్రలో నటించే అవకాశాలున్నాయి. మొత్తంగా ప్రభాస్ సరసన నటించే అవకాశం రాకపోయినా.. ఆయన హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ లో ముఖ్యపాత్రలో నటించే అవకాశం రావడంపై సోనాల్ చౌహాన్ ఆనందం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు త్వరలో ప్రభాస్ సరసన ఓ సినిమా యాక్ట్ చేస్తా అంటూ కాన్ఫిడెన్స్‌గా చెబుతోంది.
‘ఆదిపురుష్’ మూవీ విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని పూర్తిగా గ్రీన్ మ్యాట్ పైనే చిత్రీకరించారు దర్శకుడు ఓమ్ రౌత్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయి. రూ. 400 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్. ఒకవేళా ఇదే నిజమైతే.. భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ప్రభాస్ ఒకరని చెప్పవచ్చు. ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి కానుగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 15 భాషల్లో .. వాల్డ్ వైడ్‌గా 20,000 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నట్టు వార్తల వస్తున్నాయి. ఈ రకంగా ‘ఆదిపురుష్’ సినిమా పాన్ ఇండియా లెవల్ దాటిపోయి.. పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ కాబోతుంది.ఈ రకంగా ఆదిపురుష్ (Adipurush) సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు నమోదు చేయబోతుంది. తాాజాగా ఈ సినిమాను 3Dతో పాటు డాల్బీ (Dolby)లో విడుదల చేస్తున్నట్టు సమాచారం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.