Home /News /movies /

SONAKSHI SINHA TO BE SEEN IN A INTERESTING ROLE FOR SANJAY LEELA BHANSALI HEERA MANDI SR

Sonakshi Sinha : వేశ్యగా కనిపించనున్న మాజీ ఎంపీ కూతురు..

Sonakshi Sinha Photo : Instagram

Sonakshi Sinha Photo : Instagram

Sonakshi Sinha : సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కరలేదు. ఆమె మాజీ ఎంపీ, నటుడు శత్రుఘ్న సిన్హా కూతురు అని తెలిసిందే. అది అలా ఉంటే సోనాక్షి ఓ వెబ్ సిరీస్ కోసం వేశ్య పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది.

    సోనాక్షి సిన్హా గురించి కొత్తగా పరిచయం చేయనక్కర లేదు. సోనాక్షి.. సల్మాన్ ఖాన్ హీరోగా అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'దబాంగ్' సినిమాతో హిందీ సినిమా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు సోనాక్షి. ఆ తర్వాత ఆమె నటించిన కొన్ని సినిమాలు పెద్దగా అలరించకపోవడంతో ఇతర హీరోయిన్స్‌లో పోల్చుకుంటే కాస్తా వెనుకబడ్డారు. ఆమె ప్రస్తుతం భుజ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, సంజయ్ దత్, నోరా ఫతేహీ నటిస్తున్నారు. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలకానుందని తెలుస్తోంది. ఈ సినిమా హాట్ స్టార్‌లో ఆగస్టు 13న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఇక అది అలా ఉంటే సోనాక్షి ఓ వెబ్ సిరీస్ కోసం వేశ్యగా కనిపించనుందట. ప్రముఖ బాలీవుడ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ లీలా భన్సాలీ తొలి వెబ్‌సిరీస్‌లో సోనాక్షి నటించడం దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. భారీస్థాయిలో తెరకెక్కనున్న 'హీరామండి' వెబ్‌ సిరీస్‌లో ఆమె వేశ్యగా నటిస్తుందని టాక్. సంజయ్ లీలా భన్సాలీ నుంచి వస్తున్న తొలి వెబ్‌సిరీస్‌ ఇది. ఇందులో మరో పాత్రలో ఇప్పటికే హ్యూమా ఖురేషి ఎంపికైంది. ఇక ఇప్పుడు మరో ప్రధాన పాత్ర కోసం సోనాక్షి సిన్హాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలోని పాత్ర కోసం కథక్‌ నేర్చుకునే పనిలో ఉందట సోనాక్షి. సోనాక్షి గతంలో భన్సాలీ నిర్మించిన 'రౌడీ రాథోడ్‌'లో నటించిన విషయం తెలిసిందే.

    ఇక సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రం.. 'గంగూబాయి కతియా వాడి'. ఈ సినిమాలో ఆలియా భట్ నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌ గంగూబాయి గురించి చర్చించనున్నారు. ఎస్ హుస్సేన్ జాడి రచించిన మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై నవల ఆధారంగా గుంగుబాయి తెరకెక్కుతుంది. ఈ గుంగుబాయిలో అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Hindi Cinema, Sonakshi Sinha

    తదుపరి వార్తలు