సల్మాన్ స్టెప్ మదర్ పాటకు చిందేసిన సోనాక్షి

Sonakshi Sinha Sizzles in the Remix of Helen's Hit Song Mungda for Total Dhamaal | అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన ‘ముంగ్డా’ పాటను ‘ధమాల్’ సిరీస్‌లో తెరకెక్కిన మూడో సీక్వెల్ ‘టోటల్ ధమాల్’ లో రీమిక్స్ చేసారు. అంతేకాదు తాజాగా ఈ రీమిక్స్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 5, 2019, 6:16 PM IST
సల్మాన్ స్టెప్ మదర్ పాటకు చిందేసిన సోనాక్షి
సోనాక్షి సిన్హా
  • Share this:
ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలో రీమిక్స్ పాటల జోరు పెరిగింది. ఈ రూట్లోనే 1978లో హిందీలో వినోద్ ఖన్నా హీరోగా  తెరకెక్కిన ‘ఇన్‌కార్’ చిత్రంలో ‘‘ముంగడా..ముంగడా’’ అంటూ హెలెన్‌పై పిక్చరైజ్ చేసిన పాట ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే వుంది.

రాజేష్ రోషన్ ట్యూన్‌కు  లతా మంగేష్కర్ సోదరి  ఉషా మంగేష్కర్ గాత్రం  ఈ పాటను మాస్ శ్రోతలను కిరెక్కించేలా చేసింది. ఈ పాటను అప్పట్లో ప్రముఖ నర్తకి హెలెన్‌పై ఈ పాటను  పిక్చరైజ్ చేశారు.

బాలీవుడ్‌లో ఐటెం పాటలకు పెట్టింది పేరైన హెలెన్...ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తండ్రైన సలీమ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన ఈ పాటను ‘ధమాల్’ సిరీస్‌లో తెరకెక్కిన మూడో సీక్వెల్ ‘టోటల్ ధమాల్’ లో రీమిక్స్ చేసారు. అంతేకాదు తాజాగా ఈ రీమిక్స్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

అప్పట్లో హెలెన్ వేసిన స్టెప్పులను ఇపుడు సోనాక్షి సిన్హాతో అజయ్ దేవ్‌గణ్  ఈ పాటలో సందడి చేసారు.  ఇంద్రకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అజయ్ దేవ్‌గణ్‌తో పాటు అనిల్ కపూర్, మాధురి దీక్షిత్, ఇషా గుప్తాలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘టోటల్ ధమాల్’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. 

రాశిఖన్నా హాట్ ఫోటోస్ 

ఇవి కూడా చదవండి 

బాలుపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన మెగా బ్రదర్ నాగబాబు..

చంద్రబాబు, బాలయ్యలను ఖబర్ధార్ అంటోన్న రామ్ గోపాల్ వర్మ

ప్రియాంక-నిక్ జోనస్ ఏకాంత ఫొటో వైరల్...నెటిజెన్స్‌లో వెరైటీ డౌట్స్
First published: February 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు