సోనాక్షి సిన్హాపై నెటిజన్ల ట్రోలింగ్... మాల్దీవుల్లో ఏం చేసిందంటే...

Sonakshi Sinha : ఎవరు ఏమనుకుంటే నాకేంటి... నేనింతే... అనుకునే హీరోయిన్లలో సోనాక్షి సిన్హా ప్రత్యేకం. ఓవైపు కౌన్ బనేగా కరోడ్ పతిలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆమె... నెటిజన్లను మరింత రెచ్చగొడుతూ... మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 22, 2019, 9:37 AM IST
సోనాక్షి సిన్హాపై నెటిజన్ల ట్రోలింగ్... మాల్దీవుల్లో ఏం చేసిందంటే...
Sonakshi Sinha : ఎవరు ఏమనుకుంటే నాకేంటి... నేనింతే... అనుకునే హీరోయిన్లలో సోనాక్షి సిన్హా ప్రత్యేకం. ఓవైపు కౌన్ బనేగా కరోడ్ పతిలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆమె... నెటిజన్లను మరింత రెచ్చగొడుతూ... మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది.
  • Share this:
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా... మాల్దీవుల్లో ప్రత్యక్షమైంది. వేకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. స్విమ్ సూట్‌లో ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఓవైపు ఆమెపై నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నా... అవేవీ పట్టించుకోకుండా... జాలీగా తిరుగుతూ... తానో మొండి ఘటం అని నిరూపిస్తోంది. ఇంతకీ అసలు వివాదం ఏంటంటే... అమితాబ్ బచ్చన్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతిలో సోనాక్షి సిన్హా పాల్గొంది. ఈ సందర్భంగా పెద్దాయన ఆమెను... రామాయణానికి సంబంధించి ఓ సింపుల్ ప్రశ్న అడిగారు. అదేంటంటే... రామాయణం ప్రకారం... హనుమంతుడు సంజీవని మొక్కను ఎవరి కోసం తీసుకొచ్చాడు అని. అదో ఆన్సర్ లేని ప్రశ్నలా ఫీలైన సోనాక్షీ... ఆన్సర్ కోసం లైఫ్ లైన్ వాడుకుంది. అంతే... నెటిజన్లు ఫైర్ అవ్వడం మొదలుపెట్టారు. #YoSonakshiSoDumb అనే హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి... ఆమెను ఉతికారేశారు.

నెటిజన్లు అంతలా ఫైర్ అవ్వడానికి ప్రధానం కారణం ఒకటుంది. సోనాక్షి సిన్హా తండ్రి... శతృఘ్నసిన్హా. అంటే... రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నుల్లో ఒకరి పేరు. అలాంటప్పుడు ఆమెకు రామాయణం గురించి కచ్చితంగా తెలిసే అవకాశాలే ఎక్కువ. పైగా... హనుమంతుడు సంజీవనిని తీసుకొచ్చే ఘట్టం... రామాయణంలో అత్యంత కీలకమైనది. ఇప్పటికీ ఆ సంజీవని మొక్క కోసం పరిశోధకులు వెతుకుతూనే ఉన్నారు. అలాంటి సన్నివేశం గురించి సోనాక్షిసిన్హాకు తెలియకపోవడమేంటని ట్రోలింగ్ చేశారు నెటిజన్లు.ట్విట్టర్‌లో సోనాక్షికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మెమెస్ నడిచాయి. దాంతో మండిపడిన ఈ భామ నెటిజన్లపై రివర్సైంది. "నాకు పైథాగరస్ సిద్ధాంం తెలియదు, మర్చంట్ ఆఫ్ వెనిస్ తెలియదు, పీరియాడిక్ టేబుల్ తెలియదు, మొఘల్ సామ్రాజ్య చరిత్ర తెలియదు, ఏవి గుర్తులేవో... అవేవీ తెలియవు. మీకు ఛాన్స్ ఉంటే, టైమ్ ఉంటే... వాటిపైనా మెమెస్ చేయండి" అంటూ సెటైరికల్ ట్వీట్ పెట్టింది.ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే... మాల్దీవుల్లోని జుమెరా విట్టావెలీ రిసార్ట్‌లో దిగిన స్విమ్ సూట్ ఫొటోను షేర్ చేసింది సోనాక్షీ సిన్హా. "మాల్దీవుల్లో ఎండలో ఇలా ఉంటే బాగుంటుంది. అలాంటిది.. ఇక్కడ వర్షం పడుతోంది" అని కామెంట్ పెట్టింది. ప్రపంచం మొత్తంలో తనకు అత్యంత ఇష్టమైన ప్లేస్‌కి మళ్లీ వెళ్లడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది.ఇక బాలీవుడ్ విషయానికొస్తే... సోనాక్షీ చివరిగా కనిపించినది కళంక్ సినిమాలో. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాపైంది. సల్మాన్ ఖాన్‌తో ఆమె నెక్ట్స్ మూవీ దబాంగ్ 3 డిసెంబర్‌లో రిలీజ్ కానుంది.
First published: September 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading