హోమ్ /వార్తలు /సినిమా /

శక్తిమాన్‌తో శత్రుఘ్న సిన్హా పోరు.. సోనాక్షి విషయంలో..

శక్తిమాన్‌తో శత్రుఘ్న సిన్హా పోరు.. సోనాక్షి విషయంలో..

Sonakshi Sinha: శక్తిమాన్ అంటే అందరికీ తెలుసు కదా.. 90ల్లో ఉన్న వాళ్లకు అయితే దీని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దేశం మొత్తానికి అప్పట్లో సూపర్ హీరో శక్తిమాన్ ఒక్కడే.

శక్తిమాన్ అంటే అందరికీ తెలుసు కదా.. 90ల్లో ఉన్న వాళ్లకు అయితే దీని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దేశం మొత్తానికి అప్పట్లో సూపర్ హీరో శక్తిమాన్ ఒక్కడే. ముఖేష్ ఖన్నా ఈ పాత్రకు ప్రాణం పోసాడు కూడా. ఇక శత్రుఘ్న సిన్హా గురించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ రెబల్ స్టార్ ఈయన. ఇప్పుడు ఈ ఇద్దరూ గొడవ పడ్డారు. లాక్‌డౌన్ కారణంగా దూరదర్శన్ ప్రసారం చేస్తున్న రామాయణం, మహాభారతం సీరియల్స్ ఇప్పుడు ఈ ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ మధ్య చిచ్చు పెట్టింది. ఈ సీరియల్స్ పున: ప్రసారం చేయడంతో వాళ్లెందుకు గొడవ పడుతున్నారనుకుంటున్నారా..? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.

రామాయణ్ రీ టెలికాస్ట్ రేటింగ్స్ (ramayan rating)
రామాయణ్ రీ టెలికాస్ట్ రేటింగ్స్ (ramayan rating)

ఈ మధ్యే రామాయణం గురించి ఓ ప్రశ్న అడిగితే సోనాక్షి సిన్హా సమాదానం తెలియదని చెప్పింది. ఇది చూసి ముఖేష్ ఖన్నా కాస్త సెటైర్ వేసాడు. సోనాక్షిలా పురాణాల గురించి తెలియని వాళ్ల కోసమే ఇప్పుడు మళ్లీ `రామాయణం`, `మహాభారతం` లాంటి సీరియల్స్ పున:ప్రసారం చేస్తున్నారని కామెంట్ చేసాడు ఆయన. దాంతో సోనాక్షి తండ్రి, బాలీవుడ్ నటుడు కమ్ రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హా సీరియస్ అయ్యాడు.

సోనాక్షి ముఖేష్ ఖన్నా శత్రుఘ్న సిన్హా (sonakshi sinha mukesh khanna)
సోనాక్షి ముఖేష్ ఖన్నా శత్రుఘ్న సిన్హా (sonakshi sinha mukesh khanna)

తన కూతురుకు రామాయణంలో ఒక ప్రశ్న గురించి సమాధానం తెలియనంత మాత్రానా హిందువు కాకుండా పోదు.. అదే కొందరికి సమస్యగా మారిందేమో మరి నాకు తెలియదు.. అలాంటి వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ రామాయణం గురించి చెప్పే వ్యక్తికి ఏం అర్హత ఉందంటూ సీరియస్ అయ్యాడు. సోనాక్షి లాంటి కూతురు ఉండాలంటే అదృష్టం కావాలని కూతుర్ని వెనకేసుకొచ్చాడు శత్రుఘ్న. మొత్తానికి ఒక్క ప్రశ్న ఇప్పుడు ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ మధ్య చిచ్చు బాగానే రాజేసింది.

First published:

Tags: Bollywood, Shatrughan Sinha, Sonakshi Sinha

ఉత్తమ కథలు