హోమ్ /వార్తలు /సినిమా /

Tollywood: బాలకృష్ణ పక్కన నేను హీరోయిన్‌గా యాక్ట్ చేయడమా .. సోనాక్షిసిన్హా రియాక్షన్‌ వాస్తవమేనా..!

Tollywood: బాలకృష్ణ పక్కన నేను హీరోయిన్‌గా యాక్ట్ చేయడమా .. సోనాక్షిసిన్హా రియాక్షన్‌ వాస్తవమేనా..!

balayya sonakshi(file)

balayya sonakshi(file)

Tollywood: బాలీవుడ్ లేడీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోందనే వార్తలతో పాటే ఆమెను బాలకృష్ణ సినిమా నుంచి తొలగించారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే అసలు తాను ఒప్పుకోని సినిమా నుంచి ఎలా తొలగిస్తారని..ఇవన్నీ పుకార్లేనంటూ సదరు హీరోయిన్‌ కొట్టిపారేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai, India

టాలీవుడ్‌(Tollywood)లోకి మరో బాలీవుడ్ హీరోయిన్ ఎంట్రీ ఇస్తోందని ...అది కూడా నందమూరి హీరో బాలకృష్ణ(Balakrishna)అప్‌ కమింగ్ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకుంటోందని వార్తలు బాగా వినిపించాయి. షడన్‌గా ఆ హీరోయిన్‌ రెమ్యూనరేషన్(Remuneration)ఎక్కువ డిమాండ్ చేసిందని..అందుకే సినిమా దర్శక,నిర్మాతలు ఆమెను వద్దనుకొని రిజక్ట్ చేసినట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. కాని బాలీవుడ్ స్టార్ కిడ్ మాత్రం ఇవన్నీ పుకార్లేనని ...తనను ఏ డైరెక్టర్ అప్రోచ్ కాలేదని ..రెమ్యూనరేషన్‌ గురించి డిస్కర్షన్‌ జరగలేదంటూ కొట్టిపారేసింది. ఇంతకీ ఆ బాలీవుడ్(Bollywood)హీరోయిన్‌ ఎవరో తెలుసా..

Huma Qureshi: నా సొగసు చూడతరమా అంటున్న బాలీవుడ్ లేడీ ..హుమా ఖురేషి హాట్ పిక్స్ వైరల్

దబాంగ్‌ లేడీ క్లారిటీ ..

బాలీవుడ్‌ దబాంగ్ సినిమాలో సల్మాన్‌ఖాన్ పక్కన జోడి కట్టి సక్సెస్‌ కొట్టిన సోనాక్షి సిన్హా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోందని వార్తలు జోరుగా వినిపించాయి. అది కూడా డైరెక్టర్ అనీల్‌ రావిపూడి, నందమూరి బాలకృష్ణ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా సోనాక్షినే సెలక్ట్ చేశారని గుసగుసలు వినిపించాయి. నటించే విషయం పక్కన పెడితే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని ..అందుకే ఆమెను బాలకృష్ణ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోలేదనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో గట్టిగా వినిపించింది. ఈ పుకార్లపైనే స్పందించింది బాలీవుడ్ స్టార్ కిడ్ సోనాక్షి సిన్హా.

ఒప్పుకోకుండా ఎలా తొలగిస్తారు..

అసలు సినిమాలో యాక్ట్ చేసే విషయంపైనే తనను ఎవరూ సంప్రదించలేదని ..అలాంటప్పుడు తనను తప్పిస్తున్నారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేసింది. కొద్ది రోజుల క్రితం తాను టాలీవుడ్‌లో నటిస్తున్నానని వార్తలు వచ్చాయి. అవి వాస్తవం కాదని..అలాగే తాను ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసానని అందుకే తప్పించారని వస్తున్న వదంతులు నిజం కాదంది సోనాక్షి. అసలు ఒప్పుకోని సినిమా నుంచి హీరోయిన్‌ని ఎవరైనా తీసేస్తారా అంటూ ప్రశ్నించింది. ఇక టాలీవుడ్‌ సినిమాల్లో తాను యాక్ట్ చేస్తున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది.

అన్నీ పుకార్లేనా ..

బాలీవుడ్‌లో ఒకప్పుడు జోరుగా సినిమాలు చేసిన సోనాక్షి..కొంతకాలంగా ఆఫర్లు లేక వెబ్‌ సిరీస్‌లు, టీవీ షోలు చేస్తోంది. అలాంటి హీరోయిన్‌ని టాలీవుడ్‌లోకి ఎలా తెస్తారని నందమూరి అభిమానులు అంటున్నారు. అయితే బాలకృష్ణ అనీల్‌ రావిపూడి సినిమాలో సోనాక్షిని తీసుకున్నారనే వార్తను కూడా చిత్ర బృందం ఏనాడు ప్రకటించకపోవడంతో ..అసలు ఇదంతా పుకార్లుగానే చూడాలంటున్నారు.

First published:

Tags: Balakirshna, Bollywood, Sonakshi Sinha, Tollywood

ఉత్తమ కథలు