• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SONA MOHAPATRA SAYS SALMAN AS THE POSTER BOY OF TOXIC MASCULINITY SR

సల్మాన్ ఖాన్ ఓ విష స్వభావి.. : సింగర్ సోనా మహాపాత్ర ఘాటు వ్యాఖ్యలు..

సల్మాన్ ఖాన్ ఓ విష స్వభావి.. : సింగర్ సోనా మహాపాత్ర ఘాటు వ్యాఖ్యలు..

సల్మాన్, సుశాంత్, సోనా Photo : Twitter

హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌పై సింగర్ సోనా మహాపాత్ర విరుచుకుపడింది.

  • Share this:
    హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌పై సింగర్ సోనా మహాపాత్ర విరుచుకుపడింది. ఆయనది విషపూరిత స్వభావమని పేర్కోంది. సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన చావుకు కారణం అక్కడి బంధు ప్రీతి అని.. బయటవారికి ఎంత టాలెంట్ ఉన్న అవకాశాలు ఇవ్వరని, కావాలనే మానసికంగా కృంగ దీస్తారని చర్చించుకుంటున్నారు. అందులో భాగంగా బాలీవుడ్‌లో పెద్ద‌ల పెత్త‌నాన్ని ఎండ‌గ‌డుతున్నారు. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌వారికే ప్రోత్సాహం ల‌భిస్తుందా? అంటూ సినీ ప్ర‌ముఖుల తీరును విమ‌ర్శిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మ‌హ‌త్య‌కు కారణం కూడా అదే అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు. 'సూశాంత్ ప్ర‌తిభ‌కు గుర్తింపు లేదు, అత‌డిని పైకి రాకుండా అణ‌గ‌దొక్కారు!' అంటూ ఆయ‌న అభిమానులు క‌డుపు మంట‌తో ర‌గిలిపోతున్నారు. ఈ స‌ల్మాన్ ఖాన్‌కూ త‌గిలింది. దీంతో ఆయన తాజాగా స్పందించాడు. ట్వీట్టర్ వేదికగా సుశాంత్ ఫ్యాన్స్‌కు మ‌ద్ద‌తుగా ఉండాల‌ని త‌న అభిమానుల‌ను కోరాడు. "అభిమానులంద‌రికీ ఓ విజ్ఞ‌ప్తి. మీరంద‌రూ సుశాంత్ అభిమానులకు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డాలి. ఒక‌రినొక‌రు తిట్టుకోవడం స‌రికాదు. ప్రేమించే వ్య‌క్తిని కోల్పోయిన బాధ‌లో ఉన్న సుశాంత్ కుటుంబానికి, ఆయ‌న అభిమానుల‌కు తోడుగా ఉండండి" అంటూ ట్వీట్ చేశాడు.


    ఈ నేపథ్యంలో సింగర్ సోనా మహాపాత్ర స్పందిస్తూ... విషపూరిత స్వభావం, పెద్ద మనసు కలిగిన ఓ వ్యక్తి నుంచి కదలిక వచ్చిందని విమర్శించింది. గతంలో సల్మాన్ తన డిజిటల్ పెయిడ్ ఆర్మీతో ఇతరులను సోషల్ మీడియా వేదికగా వేధించాడనీ, అంతేకాదు బెదిరించడం కూడా జరిగిందని ఆమె పేర్కోంది. అయితే ఆమె ట్వీట్‌పై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. కొందరూ సోనా నువ్వు ఎంతో ధైర్య వంతురాలవంటూ.. నిజాన్ని తెలిపావంటూ పొగుడుతుంటే.. కొందరూ ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు.
    First published: