హైపర్ ఆది ట్రెండ్‌ కంటిన్యూ.. జబర్దస్త్ కామెడీ షోలో మార్పులు..

జబర్దస్త్ నుంచి నాగబాబు వెళ్లిపోయిన తర్వాత తొలి ప్రోమోస్ విడుదలయ్యాయి. నవంబర్ 22తోనే ఈయన చివరి ఎపిసోడ్ ప్లే అయింది. ఏడున్నరేళ్ల తర్వాత పూర్తిగా నాగబాబు లేకుండా ప్రసారం కాబోతున్న తొలి ఎపిసోడ్ ఇది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 22, 2019, 11:06 PM IST
హైపర్ ఆది ట్రెండ్‌ కంటిన్యూ.. జబర్దస్త్ కామెడీ షోలో మార్పులు..
హైపర్ ఆది ( ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
జబర్దస్త్ నుంచి నాగబాబు వెళ్లిపోయిన తర్వాత తొలి ప్రోమోస్ విడుదలయ్యాయి. నవంబర్ 22తోనే ఈయన చివరి ఎపిసోడ్ ప్లే అయింది. ఏడున్నరేళ్ల తర్వాత పూర్తిగా నాగబాబు లేకుండా ప్రసారం కాబోతున్న తొలి ఎపిసోడ్ ఇది. నవ్వుల రాజు లేకుండా జబర్దస్త్ అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. కానీ ఎవరున్నా లేకపోయినా కూడా మార్పులు చేసి మళ్లీ షోను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు నిర్వాహకులు. చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ లాంటి వాళ్లు లేకుండా వచ్చే వారం ఎపిసోడ్స్ టెలికాస్ట్ కానున్నాయి. దాంతో ఏదో ఒకటి కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దర్శకులు కూడా. అందులో భాగంగానే హీరో నిఖిల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. అంతేకాదు.. ఓ స్కిట్ కూడా చేసాడు.

ఇక ఫసక్ శశి టీమ్‌లో చేసే శాంతి కుమార్ తన ఫ్యామిలీని తీసుకొచ్చాడు. గత వారం హైపర్ ఆది కూడా తన ఫ్యామిలీతో స్కిట్ చేసాడు. తండ్రి, అన్నయ్యలతో కలిసి స్కిట్ కొట్టాడు. వచ్చే వారం ఇదే ట్రెండ్ కొనసాగిస్తున్నాడు శాంతి కుమార్. అంతేకాదు.. అప్పారావు కూడా తన భార్యతో కలిసి స్కిట్ చేసాడు. వీళ్లిద్దరి భార్యలు తమ భర్తలపై వేసిన పంచులు అదిరిపోయేలా పేలాయి. మరోవైపు జబర్దస్త్ షోలో ఉన్న రాకింగ్ రాకేష్ టీంను ఎక్స్ ట్రా జబర్దస్త్‌కు పంపించారు. అయితే ఎవరెన్ని చేసినా కూడా ఏదో తెలియని వెలితి మాత్రం ఈ షోలో కనిపిస్తుంది. మరి దాన్ని ఎలా కవర్ చేస్తారో చూడాలిక. ప్రస్తుతానికి విడుదలైన ప్రోమో మాత్రం అదిరిపోయింది. కానీ రానురాను ఇదే స్థాయి జబర్దస్త్ షోలో ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

First published: November 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com