Solo Brathuke So Better collecitons: ‘సోలో బ్రతుకే సో బెటర్’ 2 డేస్ కలెక్షన్స్.. సాయి తేజ్ సూపర్ స్ట్రాంగ్..

సోలో బ్రతుకే సో బెటర్ కలెక్షన్స్ (solo brathuke so better movie)

Solo Brathuke So Better collecitons: సాయి ధరమ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన సోలో బ్రతుకే సో బెటర్ కరోనా సమయంలో కూడా థియేటర్స్‌లో విడుదలైంది. 9 నెలల తర్వాత థియేటర్స్‌లో విడుదలైన తొలి తెలుగు సినిమా ఇదే.

  • Share this:
సాయి ధరమ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన సోలో బ్రతుకే సో బెటర్ కరోనా సమయంలో కూడా థియేటర్స్‌లో విడుదలైంది. 9 నెలల తర్వాత థియేటర్స్‌లో విడుదలైన తొలి తెలుగు సినిమా ఇదే. కరోనా నిబంధనలని పాటిస్తూ వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా చూడ్డానికి థియేటర్స్ వైపు అడుగులు వేస్తున్నారు. తొలిరోజు 4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా 3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దర్శక నిర్మాతలలో కొత్త ఉత్సాహం నింపుతుంది.నభా నటేష్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన సోలో బ్రతుకే సో బెటర్ రెండో రోజు వసూళ్ల రిపోర్ట్ బయటికి వచ్చింది. కేవలం 50 శాతం సీటింగ్ కెపాసిటీతోనే అదిరిపోయే వసూళ్లను సొంతం చేసుకుంటుంది ఈ చిత్రం. రెండో రోజు కూడా భారీ వసూళ్ళు సాధించడంతో దర్శక నిర్మాతలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 3.29 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఏరియాల వారీగా చిత్రం వసూళ్లు (పిఆర్ లెక్కల ఆధారంగా) చూస్తే..

solo brathuke so better,solo brathuke so better 2 days collections,solo brathuke so better movie 2 days ap&telangana collections,solo brathuke so better sai dharam tej 2 days collections,solo brathuke so better movie super strong day 2 collections,సోలో బ్రతుకే సో బెటర్ 2 డేస్ కలెక్షన్స్,సోలో బ్రతుకే సో బెటర్ 2 డేస్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్
సోలో బ్రతుకే సో బెటర్ కలెక్షన్స్ (solo brathuke so better movie)


నైజాం – 1.19 కోట్లు
సీడెడ్ – 0.59 కోట్లు
గుంటూరు – 0.26 కోట్లు
నెల్లూరు – 0.13 కోట్లు
కృష్ణ – 0.18 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.15 కోట్లు
తూర్పు గోదావరి – 0.24 కోట్లు
వైజాగ్ – 0.55 కోట్లు

solo brathuke so better,solo brathuke so better 2 days collections,solo brathuke so better movie 2 days ap&telangana collections,solo brathuke so better sai dharam tej 2 days collections,solo brathuke so better movie super strong day 2 collections,సోలో బ్రతుకే సో బెటర్ 2 డేస్ కలెక్షన్స్,సోలో బ్రతుకే సో బెటర్ 2 డేస్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్
సోలో బ్రతుకే సో బెటర్ కలెక్షన్స్ (solo brathuke so better movie)


రెండో రోజు- 3.29 కోట్లు గ్రాస్
రెండు రోజుల ఏపీ తెలంగాణ కలెక్షన్స్- 7.99 కోట్ల గ్రాస్
రెండు రోజుల ఏపీ తెలంగాణ షేర్- 4.8 కోట్లు
మూడోరోజు కూడా ఇలాగే నిలబడితే సినిమా కచ్చితంగా మూడు రోజుల్లోనే 7 కోట్ల వరకు షేర్ వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. కరోనా సమయంలో ఈ స్థాయి వసూళ్లు అంటే చిన్న విషయం కాదు. కచ్చితంగా ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంలో మరిన్ని సినిమాలు విడుదలకు రెడీ అవుతాయనడంలో సందేహం లేదు. సంక్రాంతికి రెడ్, క్రాక్, మాస్టర్ లాంటి భారీ సినిమాలు వస్తున్నాయంటే అది సోలో బ్రతుకే సో బెటర్ ఇచ్చిన ధైర్యమే.
Published by:Praveen Kumar Vadla
First published: