Solo Brathuke So Better Collections: ‘సోలో బ్రతుకే సో బెటర్’ 14 రోజుల కలెక్షన్స్.. హ్యాట్రిక్ కొట్టిన సాయి ధరమ్ తేజ్..

సోలో బ్రతుకే సో బెటర్ కలెక్షన్స్ (solo brathuke so better movie)

Solo Brathuke So Better Collections: సాయి ధరమ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన సోలో బ్రతుకే సో బెటర్ కరోనా సమయంలో కూడా థియేటర్స్‌లో విడుదలైంది. 9 నెలల తర్వాత థియేటర్స్‌లో విడుదలైన తొలి తెలుగు సినిమా ఇదే.

  • Share this:
సాయి ధరమ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన సోలో బ్రతుకే సో బెటర్ కరోనా సమయంలో కూడా థియేటర్స్‌లో విడుదలైంది. 9 నెలల తర్వాత థియేటర్స్‌లో విడుదలైన తొలి తెలుగు సినిమా ఇదే. కరోనా నిబంధనలని పాటిస్తూ వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా చూడ్డానికి థియేటర్స్ వైపు అడుగులు వేసారు. తొలిరోజు 4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా 3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దర్శక నిర్మాతలలో కొత్త ఉత్సాహం నింపింది. 14 రోజులకు గానూ ఈ చిత్రం దాదాపు 20 కోట్ల గ్రాస్.. 13.1 కోట్ల షేర్ వసూలు చేసింది. సినిమాను 10 కోట్లకు అమ్మడంతో దాదాపు 3 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. నభా నటేష్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన సోలో బ్రతుకే సో బెటర్ వసూళ్ల పరంగా బాగానే వచ్చాయి. కేవలం 50 శాతం సీటింగ్ కెపాసిటీతోనే అదిరిపోయే వసూళ్లను సొంతం చేసుకుంటుంది ఈ చిత్రం. 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాని జనవరి 1నుండీ ఓటిటిలో పే పర్ వ్యూ పద్ధతిలో విడుదల చేసినా కూడా ఈ చిత్రానికి థియేటర్లలో ఆదరణ తగ్గకపోవడం గమనార్హం.

solo brathuke so better,solo brathuke so better 11 days collections,solo brathuke so better movie 11 days ap&telangana collections,solo brathuke so better sai dharam tej 11 days ww collections,solo brathuke so better movie super strong collections,sai dharam tej hat trick,సోలో బ్రతుకే సో బెటర్ 11 డేస్ కలెక్షన్స్,సోలో బ్రతుకే సో బెటర్ 11 డేస్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్,సోలో బ్రతుకే సో బెటర్ కలెక్షన్స్
సోలో బ్రతుకే సో బెటర్ కలెక్షన్స్ (Solo Brathuke So Better)


ఇక ఈ చిత్రం 14 రోజుల కలెక్షన్లను ఒకసారి గమనిస్తే :

నైజాం 4.41 cr
సీడెడ్ 2.10 cr
ఉత్తరాంధ్ర 1.70 cr
ఈస్ట్ 1.02 cr
వెస్ట్ 0.75 cr
కృష్ణా 0.78 cr
గుంటూరు 1.10 cr
నెల్లూరు 0.59 cr

ఏపీ+తెలంగాణ 12.29 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.53 cr
ఓవర్సీస్ 0.38 cr
వరల్డ్ వైడ్ టోటల్ 13.1 cr

solo brathuke so better,solo brathuke so better 11 days collections,solo brathuke so better movie 11 days ap&telangana collections,solo brathuke so better sai dharam tej 11 days ww collections,solo brathuke so better movie super strong collections,sai dharam tej hat trick,సోలో బ్రతుకే సో బెటర్ 11 డేస్ కలెక్షన్స్,సోలో బ్రతుకే సో బెటర్ 11 డేస్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్,సోలో బ్రతుకే సో బెటర్ కలెక్షన్స్
సోలో బ్రతుకే సో బెటర్ కలెక్షన్స్ (solo brathuke so better movie)


'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రానికి రూ.9.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసారు. 14 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 13.1 కోట్ల షేర్ వసూలు చేసింది. అంటే దాదాపు 3 కోట్లకు పైగా లాభం వచ్చిందన్నమాట. ఈ లెక్కన సాయి ధరమ్ తేజ్ హ్యాట్రిక్ పూర్తి చేసాడు. దీనికి ముందు చిత్రలహరి, ప్రతిరోజూ పండగే సినిమాలతో విజయం అందుకున్నాడు సాయి.
Published by:Praveen Kumar Vadla
First published: