Sohel: సొహైల్‌కి గ్రాండ్ వెల్‌క‌మ్‌ చెప్పేందుకు...ఇంటి దగ్గర భారీ ఏర్పాట్లు

Sohel: సొహైల్‌కి గ్రాండ్ వెల్‌క‌మ్‌ చెప్పేందుకు...ఇంటి దగ్గర భారీ ఏర్పాట్లు

సోహైల్

బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్(Bigg Boss 4 Telugu) పండుగ ఇవాళ్టితో ముగియ‌నుంది. 105 రోజుల పాటు సాగిన ఈ షో గ్రాండ్ ఫినాలే ఇవాళ జ‌ర‌గ‌నుండ‌గా.. మ‌రికొన్ని గంట‌ల్లో విజేత ఎవ‌రో అధికారికంగా తెలియ‌నుంది. ఇక సోష‌ల్ మీడియా లీకువీరుల ప్ర‌కారం అభిజీత్(Abijeet) విన్న‌ర్ అని

  • Share this:
    Sohel Bigg Boss 4: బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ పండుగ ఇవాళ్టితో ముగియ‌నుంది. 105 రోజుల పాటు సాగిన ఈ షో గ్రాండ్ ఫినాలే ఇవాళ జ‌ర‌గ‌నుండ‌గా.. మ‌రికొన్ని గంట‌ల్లో విజేత ఎవ‌రో అధికారికంగా తెలియ‌నుంది. ఇక సోష‌ల్ మీడియా లీకువీరుల ప్ర‌కారం అభిజీత్ విన్న‌ర్ అని, సొహైల్ 25 ల‌క్ష‌లు తీసుకొని వ‌చ్చాడ‌ని, అఖిల్ ర‌న్న‌ర్ అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సొహైల్‌కి గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పేందుకు అత‌డి ఇంటి ద‌గ్గ‌ర భారీ ఏర్పాట్లు చేశారు. ఇంటి ముందు సొహైల్‌ బ్యాన‌ర్‌ని పెట్టిన ఇరుగుపొరుగు వారు.. 105 పాటు హౌజ్‌లో ఉండి మ‌మ్మ‌ల్ని గ‌ర్వ‌ప‌డేలా చేశావు. స్వాగ‌తం నీకు చాలా గ‌ట్టిగా ఉంటుంది అని సొహైల్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

    కాగా సింగ‌రేణి ముద్దుబిడ్డ‌గా ఈ సీజ‌న్ హౌజ్‌లో అడుగెట్టిన సొహైల్ ముందునుంచి బిగ్‌బాస్ వీక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటూ వ‌స్తున్నాడు. మొద‌ట్లో హౌజ్‌లో ఎక్కువ‌గా కోప్ప‌డుతూ ఉండే సొహైల్.. ఆ త‌రువాత త‌న‌ను తాను మార్చుకుంటూ వ‌చ్చాడు. అలాగే లేడి కంటెస్టెంట్‌ల విష‌యంలోనూ చాలా కంట్రోల్ చేసుకుంటూ వ‌చ్చాడు.




    ఇక క‌థ వేరేలా ఉంటుంది అంటూ సొహైల్ హౌజ్‌లో అన్న డైలాగ్‌లు బ‌య‌ట చాలా మందికి అల‌వాటు అయ్యాయి. ఇలా త‌న బిహేవియ‌ర్‌తో టాప్ 5లో చోటు సంపాదించుకున్నాడు సొహైల్. అయితే 25ల‌క్ష‌లు తీసుకొని అత‌డు హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు అత‌డికి గ్రాండ్ వెల్‌క‌మ్ ఇచ్చేందుకు బ‌య‌ట‌క ప్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
    Published by:Manjula S
    First published: