హోమ్ /వార్తలు /సినిమా /

Bigg Boss Sohel: బిగ్ బాస్ ఫెమ్ సోహైల్ హీరోగా లక్కీ లక్ష్మణ్.. టైటిల్ సాంగ్ రిలీజ్

Bigg Boss Sohel: బిగ్ బాస్ ఫెమ్ సోహైల్ హీరోగా లక్కీ లక్ష్మణ్.. టైటిల్ సాంగ్ రిలీజ్

Photo Twitter

Photo Twitter

బిగ్ బాస్ ఫెమ్ సోహైల్, మోక్ష జంటగా రాబోతున్న కొత్త సినిమా లక్కీ లక్ష్మణ్. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను మజిలీ,ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ విడుదల చేయడం విశేషం.

తన చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీఫెలో అంటున్నా కూడా తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో ఔట్ & ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్‌’ ( Lucky Lakshman). దత్తాత్రేయ మీడియా పతాకంపై ఎ.ఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. బిగ్ బాస్ ఫెమ్ సోహైల్, మోక్ష జంటగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా ఈ సినిమాలోని 'అదృష్టం హలో అంది రో.. చందమామ' టైటిల్ లిరికల్ విడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను మజిలీ,ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ విడుదల చేయడం విశేషం.

కథానాయకుడు రాత్రికి రాత్రే ధనవంతుడు అవుతాడనే కాన్సెప్ట్ చుట్టూ ఈ పాట తిరుగుతుంది. హీరో సోహైల్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు "అదృష్టం హలో అంది రో చందమామ" అంటూ సాగే లిరిక్స్ రిచ్ కిడ్ 'హవా'లో సాగుతున్న ఈ పాటకు సోహైల్ డాన్స్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా అని చెప్పవచ్చు. ప్రముఖ రచయిత భాస్కరపట్ల రాసిన ఈ గీతాన్ని రామ్ మిరియాల ఆలపించారు. ఈ పాటకు విశాల్ అందించిన కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ బాణీలు కట్టారు.

ఈ సందర్బంగా శివ నిర్వాణ మాట్లాడుతూ..”లక్కీ లక్ష్మణ్” లోని ఈ టైటిల్ సాంగ్ చాలా బాగుంది. ఈ చిత్ర దర్శకుడు ఏ ఆర్.అభి , నిర్మాత హరిత గిగినేని లకు ఇది మొదటి చిత్రమైనా చాలా చక్కగా తెరకెక్కించారు. వీరిద్దరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలి. నటుడు సోహైల్ నటన బాగుంటుంది. ఇందులో తన డ్యాన్స్ చూడముచ్చటగా ఉంది. వీరి ముగ్గురు కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర హీరో సొహైల్ మాట్లాడుతూ.. ''దర్శకులు శివ నిర్వాణ గారు ఎంతో బిజీగా ఉన్నా మా లక్కీ లక్ష్మణ్ టైటిల్ సాంగ్ విడియోను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా దర్శకులు ఏ ఆర్. అభి, నిర్మాత హరిత గిగినేని లకు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో సినిమా కథలను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా అంతే అభిరుచిని కలిగి ఉన్నారు. ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ అవుట్‌పుట్ పరంగా క్వాలిటీ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సీనియర్ టెక్నీషియన్స్ తో నిర్మించిన ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది'' అన్నారు.' isDesktop="true" id="1394398" youtubeid="HZuXtj7boIo" category="movies">

ఈ సినిమాలో సోహెల్ తో పాటు మోక్ష, దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్, మాస్టర్ కార్తికేయ, ఝాన్సీ, రచ్చ రవి , జబర్దస్త్ కార్తిక్ , జబర్దస్త్ గీతు రాయల్ కామెడీ స్టార్స్ ఫేమ్ యాదం రాజు తదితరులు నటించారు.

First published:

Tags: Bigg Boss, Bigg Boss Sohel, Tollywood