హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas | Radhe Shyam : రాధేశ్యామ్ నుంచి మరోసాంగ్ విడుదల.. అదరగొట్టిన అర్జిత్ సింగ్..

Prabhas | Radhe Shyam : రాధేశ్యామ్ నుంచి మరోసాంగ్ విడుదల.. అదరగొట్టిన అర్జిత్ సింగ్..

Soch liya from Radhe Shyam Photo :Twitter

Soch liya from Radhe Shyam Photo :Twitter

Prabhas | Radhe Shyam : ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ నగుమోము తారలే కూడా చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ విశేషం ఏమంటే ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. సౌత్‌కు పాటలు వేరు, నార్త్‌కు అంటే హిందీకి పాటలను వేరుగా రూపోందిస్తున్నారు. దీంతో హిందీకి సంబంధించిన పాట సోచ్ లియా అనే పాటను చిత్ర యూనిట్ తాజా విడుదల చేయడం జరిగింది. మిథున్ సంగీతం అందిస్తున్న ఈ పాటను హిందీ ఫేమస్ సింగర్ అర్జిత్ సింగ్ పాడారు.

ఇంకా చదవండి ...

Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 23న ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం రాధేశ్యామ్. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా మొదలయ్యి దాదాపు మూడేళ్లు అవుతుంది. వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుకావట్లేదని అభిమానులు అందోళన పడుతున్న వేళా.. ఈ చిత్రం నుంచి వరుసగా పాటలను విడుదల చేస్తోంది చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను గత నెల 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రాతలే అంటూ సాగిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ నగుమోము తారలే కూడా చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ విశేషం ఏమంటే ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. సౌత్‌కు పాటలు వేరు, నార్త్‌కు అంటే హిందీకి పాటలను వేరుగా రూపోందిస్తున్నారు. దీంతో హిందీకి సంబంధించిన పాట సోచ్ లియా అనే పాటను చిత్ర యూనిట్ తాజా విడుదల చేయడం జరిగింది. మిథున్ సంగీతం అందిస్తున్న ఈ పాటను హిందీ ఫేమస్ సింగర్ అర్జిత్ సింగ్ పాడారు. మనోజ్‌ లిరిక్స్ అందించారు. హిందీలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌తో కలిసి టీ సిరీస్ నిర్మిస్తోంది. యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాట మంచి ఆదరణ పొందుతోంది.

ఇక తెలుగు విషయానికి వస్తే.. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ సంక్రాంతి బరిలో రాధేశ్యామ్‌తో పాటు ఆర్ ఆర్ ఆర్, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలు విడుదలకానున్నాయి. ఇక 'సాహో' తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి ఉంది. దీనికి తోడు వరుస హిట్లతో ఉన్న పూజ హెగ్డే నుంచి కొత్త ఏడాదిలో వస్తున్న మొదటి భారీ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో కృష్ణంరాజు కనిపించనున్నారని తెలుస్తోంది.

ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఆ మధ్య ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. రాధే శ్యామ్ టీజర్ అభిమానులందరినీ ఉర్రూతలూగించిందనే చెప్పోచ్చు. అద్భుతమైన విజువల్స్, విక్రమాదిత్యగా ప్రభాస్ లుక్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. రాధే శ్యామ్ తెలుగు టీజర్ టాలీవుడ్లో ఉన్న అన్ని రికార్డులను చెరిపివేసింది. ఈ టీజర్ విడుదలైన కేవలం 20 గంటల్లోనే, యూట్యూబ్‌లో 35 మిలియన్ ప్లస్ వ్యూస్‌ని సాధించింది. టీజర్‌కు కూడా అర మిలియన్‌కు పైగా లైక్స్‌ వచ్చాయి. ఇక ఈ టీజర్‌లో ప్రభాస్ చేసిన విక్రమ్ ఆదిత్య పాత్రను పరిచయం చేశారు. ప్రభాస్ పాత్రను ఓ లెవల్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ మనుషుల భవిష్యత్తు చెప్పే వాడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో పూజ హెగ్డే ప్రేరణ పాత్రలో పూజా కనపడనుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Vaishnavi Chaitanya - Siri - Varsha: బుల్లితెర టూ వెండితెర వయా యూ ట్యూబ్.. కిరాక్ పుట్టిస్తున్న సోషల్ మీడియా బ్యూటీస్..

ఇక ఈ సినిమా హిందీ హక్కులు మినహా మిగతా ముఖ్య భాషల హక్కులు అన్నీ (Radhe Shyam on Zee5) జీ5 సంస్థ కొనుగోలు చేశారట. అయితే థియేట్రికల్ రన్ తర్వాత మాత్రమే రాధేశ్యామ్‌ను జీ5లో ప్రసారం చేయనున్నారని తెలిసింది. రాధేశ్యామ్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ చేస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ తన 25 వ సినిమా ను అర్జున్ రెడ్డి ఫేమ్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నారు. ఈ చిత్రానికి స్పిరిట్ (Spririt) అంటూ అప్పుడే టైటిల్‌ను కూడా ప్రకటించారు. భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. టైటిల్‌ లోగోను బట్టి ఈ సినిమాలో పోలీసుల గురించి చర్చించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని టీ సీరీస్‌తో కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Anchor Varshini : నాభి అందాలతో కేకపెట్టిస్తోన్న యాంకర్ వర్షిణి.. వైరల్ అవుతోన్న పిక్స్..

భారీ స్థాయిలో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఏకంగా 8 భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ప్రభాస్ హీందీ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు ఆదిపురుష్ (Adipurush) అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రం తాజాగా చిత్రికరణను పూర్తి చేసుకుంది. దీంతో ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది.

ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఆగస్టు 11 2022 న విడుదల కానుంది. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలను చేస్తున్నారు. వాటిలో కేజీఎఫ్ దర్శకుడి కాంబినేషన్‌లో అనౌన్స్ చేసిన సలార్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా కన్నడ ఉగ్రమ్ సినిమాకు రీమేక్‌గా వస్తోందని సమాచారం. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. వీటితో పాటు ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ దర్శకత్వంలో  ప్రాజెక్ట్ K (Project K) అనే భారీ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షెడ్యూల్ వచ్చే డిసెంబర్ నెల నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇండియాలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, ప్రభాస్‌లు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Pooja Hegde, Prabhas, Tollywood news

ఉత్తమ కథలు