• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SOBHAN BABU AMITABH BACHCHAN SOBHAN BABU REMAKE MANY AMITABH BACHCHAN SUPER HIT FILMS HERE ARE THE LIST TA

Sobhan Babu - Amitabh: శోభన్ బాబు, అమితాబ్ బచ్చన్ మధ్య ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

Sobhan Babu - Amitabh: శోభన్ బాబు, అమితాబ్ బచ్చన్ మధ్య ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

శోభన్ బాబు, అమితాబ్ బచ్చన్ (File/Photo)

Amitabh Bachchan-Sobhan Babu: నట భూషణ శోభన్ బాబు 1959లో భక్త శబరి సినిమాతో నటుడిగా అడుగుపెట్టినా.. ముందుగా విడుదలైన సినిమా ‘దైవ బలం’. ఇక అమితాబ్ బచ్చన్ బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసారు. ఇక అమితాబ్ బచ్చన్, శోభన్ బాబు మధ్య ఓ రిలేషన్ ఉంది.

  • Share this:
    Amitabh Bachchan-Sobhan Babu: నట భూషణ శోభన్ బాబు 1959లో భక్త శబరి సినిమాతో నటుడిగా అడుగుపెట్టినా.. ముందుగా విడుదలైన సినిమా ‘దైవ బలం’. ఈ సినిమాలో శోభన్ బాబు కాసేపు అలా కనిపించారు.  అమితాబ్ బచ్చన్ విషయానికొస్తే..  1969లో కే.ఏ.అబ్బాస్ దర్శకత్వంలో ‘సాత్ హిందూస్థానీ’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇక బిగ్‌బీ హీరోగా నటించిన ఏకైక బ్లాక్ అండ్ వైట్ చిత్రం. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. ఎన్టీఆర్,కృష్ణ సహా పలువురు హీరోలు అమితాబ్ సూపర్ హిట్ చిత్రాలను తెలుగులో రీమేక్ చేసారు. ఇక నట భూషణ శోభన్ బాబు కూడా బిగ్‌బీ నటించిన పలు  హిట్ చిత్రాలను తెలుగులో రీమేక్ చేసారు.

    అమితాబ్ బచ్చన్ హిందీలో నటించిన కొన్ని సూపర్ హిట్ చిత్రాలను శోభన్ బాబు తెలుగులో రీమేక్ చేసారు. చాలా సినిమాలు హిందీ నుంచి ఇక్కడికి తెచ్చిన మన సొగ్గాడు... సక్సెస్‌లు కూడా బాగానే కొట్టాడు.‘రోటీ కప్డా ఔర్ మకాన్’ సినిమా ‘జీవన పోరాటం’ అయింది.

    శోభన్ బాబు రీమేక్ చేసిన అమితాబ్ రీమేక్ సినిమా జీవన పోరాటం (Twitter/Photo)


    కానీ ఈ మూవీలో మాత్రం శోభన్ బాబు ...మనోజ్ కుమార్ పాత్రలో నటిస్తే..రజినీకాంత్ బిగ్‌బీ క్యారెక్టర్ చేసారు.ఇక అమితాబ్ నటించిన ‘మజ్బూర్’ ... ‘రాజా’గా రీమేక్ అయింది. ఆ తర్వాత అమితాబ్ నటించిన ‘కస్మే వాదే’ మూవీ తెలుగులో ‘చేసిన బాసలు’గా మారింది.

    అమితాబ్ ‘కస్మే వాదే’ సినిమాను తెలుగులో ‘చేసిన బాసలు’గా రీమేక్ చేసిన అమితాబ్ బచ్చన్ (Youtube/Credit)


    ఇక బిగ్‌బీ నటించిన ‘త్రిశూల్’ కాస్తా ‘మిష్టర్ భరత్’ అయితే, ‘ఖుద్దార్’ మూవీ... ‘డ్రైవర్ బాబు’ సినిమాగా తెలుగు వారి ముందుకు వచ్చింది. మొత్తానికి శోభన్ బాబు, అమితాబ్‌ల కనెక్షన్ బాగానే వర్కౌటైంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు