అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో'.. టైటిల్‌లో మార్పు..

Ala Vaikuntapuramlo : తాజాగా అల్లు అర్జున్ సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్ తనకు కలిసొచ్చిన 'అ' సెంటిమెంట్‌నే ఫాలో అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిదే టైటిల్‌లో న్యూమరాలజీ ప్రకారం ఒక కరెక్షన్ చేశారు.

news18-telugu
Updated: September 28, 2019, 7:17 PM IST
అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో'.. టైటిల్‌లో మార్పు..
అల వైకుంఠపురం పోస్టర్
  • Share this:
సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సినిమా మొదలుపెట్టాలన్నా.. విడుదల చేయాలన్నా.. ప్రతీది ముహూర్తం చూసుకునే చేస్తారు. అలాగే సినిమా టైటిల్స్ విషయంలోనూ అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతుంటారు. కొంతమంది న్యూమరాలజీ ప్రకారం టైటిల్స్‌లో మార్పులు చేర్పులు చేసుకుంటే..
మరికొంతమంది గతంలో విజయం సాధించిన తమ సినిమా పేర్లకు తగ్గట్టుగా టైటిల్స్ పెట్టుకుంటారు. తాజాగా అల్లు అర్జున్ సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్ తనకు కలిసొచ్చిన 'అ' సెంటిమెంట్‌నే ఫాలో అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిదే టైటిల్‌లో న్యూమరాలజీ ప్రకారం ఒక కరెక్షన్ చేశారు. ఇదివరకు 'అల వైకుంఠపురములో' టైటిల్‌ను ఇంగ్లీష్‌లో 'Ala Vaikuntapuramloo' అని ప్రమోట్ చేయగా.. ఇప్పుడు మరో ఆర్ చేర్చి.. 'Ala Vaikuntapurramloo' అని టైటిల్‌ను ప్రమోట్ చేస్తున్నారు. న్యూమరాలజీ

సెంటిమెంట్ మేరకే ఈ కరెక్షన్ చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా నుంచి విడుదలైన 'సామవజవరగమన' పాటకు మంచి స్పందన లభిస్తోంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది.


Published by: Srinivas Mittapalli
First published: September 28, 2019, 7:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading