Jabardasth: జబర్ధస్త్‌, ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లో ఊహించని మార్పు.. కోతలు మొదలు.. అసలేం జరుగుతోంది ?

జబర్దస్త్ (Image:ETVJabardasth)

Jabardasth: ‌జబర్ధస్త్, ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లో కనిపించిన మార్పు వెనుక అసలు కారణం ఏమిటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించడంతో జబర్ధస్త్ కామెడీ షో పాత్ర ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీవీతో పాటు ఇతర మాధ్యమాల్లోనూ జబర్ధస్త్ షోను వీక్షించేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఆడియెన్స్‌లో జబర్ధస్త్‌‌కు ఉన్న క్రేజ్ కారణంగానే ఎక్స్‌ట్రా జబర్ధస్త్ పుట్టుకొచ్చింది. కొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరించడంతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న ఈ రెండు కార్యక్రమాల్లో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. ఇప్పటివరకు కామెడీ స్కిట్స్‌ విషయంలో ఈ రెండు కార్యక్రమాల్లో ఎప్పుడు తగ్గుదల కనిపించలేదు. ఒకరిద్దరి స్కిట్స్‌ ప్రేక్షకులను అంతగా మెప్పించకపోయినప్పటికీ.. వారిని ఎప్పటిలాగానే కంటిన్యూ చేస్తూ వస్తోంది జబర్ధస్త్ మేనేజ్‌మెంట్. అయితే తాజా ఎపిసోడ్స్‌లో మాత్రం స్కిట్స్‌‌లో కోత పెట్టడం కనిపించింది. గతంలో ఒక్కో ఎపిసోడ్‌లో ఆరు స్కిట్స్ ఉండగా.. ఇటీవల ప్రసారమైన జబర్ధస్త్, ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లలో మాత్రం కేవలం ఐదు స్కిట్స్‌ మాత్రమే ఉన్నాయి.

    అంతేకాదు అంతకుముందు గంటన్నర పాటు ఉన్న ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు గంటకు పరిమితం చేశారు. మిగతా అరగంటలో గతంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్కిట్స్‌ను బెస్ట్ ఆఫ్ జబర్ధస్త్‌ పేరుతో టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే ఉన్నపళంగా జబర్ధస్త్‌, ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లో ఈ మార్పు ఎందుకు చేశారనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఆడియెన్స్‌ను మెప్పించలేకపోతున్న కొన్ని టీమ్స్‌ను పక్కనపెట్టి వారిని మిగతా టీమ్స్‌లో కలిపేశారనే టాక్ వినిపిస్తోంది.

    మరోవైపు స్కిట్స్‌ను తగ్గించడం వెనుక కాస్ట్ కట్టింగ్ వ్యూహం ఏమైనా ఉందా అనే చర్చ కూడా సాగుతోంది. కారణం ఏదేమైనా ‌జబర్ధస్త్, ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లలో వచ్చిన సడెన్ మార్పుల వల్ల ఇప్పటికప్పుడు వాటిపై ప్రభావం ఉండకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే దీన్ని జబర్ధస్త్ యాజమాన్యం ఇలాగే కొనసాగిస్తుందా లేక మళ్లీ పాత ఫార్మాట్‌లోకి మారిపోతుందా అన్నది తెలియాలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే.
    Published by:Kishore Akkaladevi
    First published: