హోమ్ /వార్తలు /సినిమా /

Dhee show: ఒక్క టికెట్ పై 6 బ్లాక్ బస్టర్ సినిమాలు.. ఢీ షోలో మాములు రచ్చ కాదుగా!

Dhee show: ఒక్క టికెట్ పై 6 బ్లాక్ బస్టర్ సినిమాలు.. ఢీ షోలో మాములు రచ్చ కాదుగా!

Dhee show: బుల్లితెరపై ప్రస్తుతం వెండితెరకు ఉన్నంత క్రేజ్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఒకప్పుడు సీరియల్స్ మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సీరియల్స్ తో పాటు ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోలు కూడా ప్రేక్షకులను బాగా సందడి చేస్తున్నాయి.

ఇంకా చదవండి ...

  Dhee show: బుల్లితెరపై ప్రస్తుతం వెండితెరకు ఉన్నంత క్రేజ్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఒకప్పుడు సీరియల్స్ మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సీరియల్స్ తో పాటు ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోలు కూడా ప్రేక్షకులను బాగా సందడి చేస్తున్నాయి. ఇప్పటికే స్టార్ మా, ఈటీవీ, జీ తెలుగు వంటి ఛానల్స్ లో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్, రియాలిటీ షోలు ప్రసారమవుతున్నాయి. ఇక అందులో ఎన్నో రకాల పర్ఫామెన్స్ లతో బాగా ఆకట్టుకుంటారు. ఇదిలా ఉంటే ఈటీవీలో ప్రసారమవుతున్న 'ఢీ' డాన్స్ షో గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఎంతోమంది డాన్సర్స్ మంచి గుర్తింపు తెచ్చుకొని కొరియోగ్రాఫర్స్ గా మారారు. ఇక కంటెస్టెంట్ లు చేసే డాన్స్ స్టెప్పుల గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని స్కిట్ లతో కూడా డాన్స్ స్టెప్ లు చేస్తూ బాగా ఆకట్టుకుంటారు. అలాంటిది తాజాగా మరింత క్రేజీ ఎంటర్టైన్మెంట్ తో ముందుకు రానున్నారు. ఏకంగా 6 బ్లాక్ బస్టర్ సినిమాల పర్ఫామెన్స్ ను ఏకంగా ఒకే టికెట్ పై చూపించనున్నారు.

  ప్రస్తుతం ఢీ డాన్స్ షోకు సంబంధించిన ప్రోమో విడుదలవ్వగా యూట్యూబ్ లో బాగా వైరల్ గా మారింది. ఇక ఇందులో యాంకర్ ప్రదీప్ జై పాత్రలో, జడ్జి పూర్ణ అరుంధతి, ప్రియమణి మిత్రవింద, గణేష్ మాస్టర్ జానీ గెటప్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇక టీం లీడర్స్ సుడిగాలి సుధీర్ ఇంద్ర, యాంకర్ రష్మీ జెస్సీ, హైపర్ ఆది కాలభైరవ, దీపిక పిల్లి అతిలోక సుందరి లుక్ లతో కనిపించారు.

  ఇక ఇందులో కంటెస్టెంట్ లు స్టార్ హీరోల పర్ఫామెన్స్ లతో బాగా పర్ఫామెన్స్ చేశారు. అంతేకాకుండా సుడిగాలి సుధీర్ నరసింహ పాత్రతో ప్రియమణి, పూర్ణ తో కలిసి.. అచ్చం రజినీ స్టైల్లో అదరగొట్టాడు. ఇక పవన్ నటించిన వకీల్ సాబ్ కోర్టు సన్నివేశం మాత్రం అక్కడ ఉన్న వారితో పాటు ప్రేక్షక హృదయాలను కూడా కదిలించింది. గణేష్ మాస్టర్ ఏకంగా కంట నీరు పెడుతూ బాగా ఫైర్ అయ్యాడు.

  https://youtu.be/CK_Z8xxcP6Q

  ఇందులో వకీల్ సాబ్, నరసింహ, జయం, అర్జున్ రెడ్డి, బిజినెస్ మాన్, సై వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చిన సన్నివేశాలతో కంటెస్టెంట్ పర్ఫామెన్స్ ఉండబోతున్నట్లు ప్రకటించారు. మొత్తానికి ఈ ప్రోమో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా ఈ వారం మరింత క్రేజ్ తో సందడి చేయనుంది. ఇక ఈ ఎపిసోడ్ కోసం వెయిటింగ్ అని బుల్లితెర ప్రేక్షకులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

  First published:

  Tags: Anchor pradeep, Anchor rashmi, Deepika pilli, Dhee 13, Dhee show, Ganesh master, Hyper Aadi, Kings vs queens, Priyamani, Sudigali sudheer

  ఉత్తమ కథలు