హోమ్ /వార్తలు /సినిమా /

Siva Shankar : శివ శంకర్ మాస్టర్ చికిత్స కోసం అండగా రంగంలోకి సోనూ సూద్..

Siva Shankar : శివ శంకర్ మాస్టర్ చికిత్స కోసం అండగా రంగంలోకి సోనూ సూద్..

అది తమ మీదకు ఎక్కడొస్తుందో అనే భయంతో శివ శంకర్‌ మాస్టర్ పెద్దమ్మ పరుగు తీసింది. ఈ క్రమంలోనే ఆమె కింద పడిపోయింది. ఆ సమయంలో ఆమె చేతిలో ఏడాదిన్నర వయసున్న శివశంకర్ కూడా ఉన్నాడు. అప్పుడే ఆయన వెన్నెముకకు తీవ్ర గాయమైంది. ఆ దెబ్బ తర్వాత నెల రోజుల వరకు ఆయన కనీసం పైకి కూడా లేవలేదు.. అంతేకాదు తీవ్రమైన జ్వరం కూడా వచ్చింది.

అది తమ మీదకు ఎక్కడొస్తుందో అనే భయంతో శివ శంకర్‌ మాస్టర్ పెద్దమ్మ పరుగు తీసింది. ఈ క్రమంలోనే ఆమె కింద పడిపోయింది. ఆ సమయంలో ఆమె చేతిలో ఏడాదిన్నర వయసున్న శివశంకర్ కూడా ఉన్నాడు. అప్పుడే ఆయన వెన్నెముకకు తీవ్ర గాయమైంది. ఆ దెబ్బ తర్వాత నెల రోజుల వరకు ఆయన కనీసం పైకి కూడా లేవలేదు.. అంతేకాదు తీవ్రమైన జ్వరం కూడా వచ్చింది.

Siva Sankar Master: టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఎన్నో పాటలకు కొరియోగ్రఫీ అందించిన  శివశంకర్‌ మాస్టర్‌ కరోనా బారిన పడ్డారు. ఈయన చికిత్స చేయించేందకు ప్రముఖ నటుడు సోనూసూద్ ముందుకు వచ్చారు.

  Siva Sankar Master: టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఎన్నో పాటలకు కొరియోగ్రఫీ అందించిన శివ శంకర్‌ మాస్టర్‌ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. శివశంకర్‌ మాస్టర్‌ (Siva Shankar Master ) ఇటీవల కరోనా బారిన పడడంతో ఆయన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు. శివశంకర్‌ మాస్టర్‌ ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు. శివశంకర్‌ మాస్టర్‌ ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉందని అంటున్నారు. ఇక మరోవైపు శివశంకర్‌ మాస్టర్‌ పెద్దకుమారుడికి కూడా కరోనా పాజిటివ్‌గా తెలింది. దీంతో ఆయనకు కూడా కొంత సీరియస్‌గా ఉందని.. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని తెలుస్తోంది.

  ప్రస్తుతం శివ శంకర్ మాస్టర్ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందట. అందుకే దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కోవలో ప్రముఖ నటుడు సోనూ సూద్ .. ఈ విషయం తెలుసుకొని.. శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితిని ఆరా తీయడంతో పాటు ఆయన చికిత్సకు అవసరమయ్యే ఆర్ధిక సాయం చేయడానికి ముందుకొచ్చారు.

  గతేడాది దేశ వ్యాప్తంగా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో ఎంతో మంది పేదలతో పాటు రోజు కూలీలు కాలి నడకన సొంతూరు బాట పట్టారు. ఈ కోవలో సోనూ సూద్.. సొంతంగా వారిని విమానాలు, ప్రత్యేక బస్సుల సాయంతో వారి స్వస్థలాకు పంపించి రియల్ హీరోగా పేరు గడించారు.

  Dadasaheb Phalke Award for Rajinikanth: రజినీకాంత్ సహా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సినీ దిగ్గజాలు వీళ్లే..

  ప్రస్తుతం శివ శంకర్ మాస్టర్ భార్య కరోనాతో హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. చిన్నకొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు. కుటుంబం మొత్తం కరోనా బారిన పడడంతో రోజూవారి ఖర్చులకు అధిక మొత్తంలో అవుతుండటంతో.. అంత మొత్తం భరించే శక్తి తమ వద్ద లేదని అంటున్నారు శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు.

  Drushyam Movie Review : విక్టరీ వెంకటేష్ ‘దృశ్యం 2’ మూవీ రివ్యూ..

  దీంతో ఇండస్ట్రీ వర్గాల నుండి ఏదైనా కొంత సాయం కావాలని శివశంకర్ మాస్టర్ తనయుడు అజయ్ కృష్ణ కోరుతున్నారని తెలుస్తోంది. శివశంకర్ మాస్టర్ డాన్స్ మాస్టర్‌గా పరిచయం అక్కరలేని పేరు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసి తనకంటూ ఓ ప్రత్యేక ఐడెంటిటీని సంపాదించుకున్నారు. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా వచ్చిన మగధీర సినిమాలో ధీర ధీర సాంగ్‌కు ఆయనకు జాతీయ అవార్డ్ వరించింది. ఈ కోవలో సోనూ సూద్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆయన చికిత్సకు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Siva Shankar Master, Sonu Sood, Tollywood

  ఉత్తమ కథలు