Home /News /movies /

Siva Sankar master passed away : శివశంకర్ మాస్టర్ కన్నుమూత... చిరంజీవి, రాజమౌళి సంతాపం..

Siva Sankar master passed away : శివశంకర్ మాస్టర్ కన్నుమూత... చిరంజీవి, రాజమౌళి సంతాపం..

Chiranjeevi and Rajamouli Photo : Twitter

Chiranjeevi and Rajamouli Photo : Twitter

Siva Sankar Master: టాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ (72) కన్నుమూశారు.  కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్న శివ శంక‌ర్ మాస్ట‌ర్‌. ఈ రోజు రాత్రి 8 గంట‌ల‌కు తుది శ్వాస విడిచారు.

  Siva Sankar Master: టాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ (72) కన్నుమూశారు.  కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్న శివ శంక‌ర్ మాస్ట‌ర్‌. ఈ రోజు రాత్రి 8 గంట‌ల‌కు (Siva Sankar master passed away)  తుది శ్వాస విడిచారు. శివశంకర్‌ మాస్టర్‌ ఇటీవల కరోనా బారిన పడడంతో ఆయన్ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. శివశంకర్‌ మాస్టర్‌ ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా మారింది. కొన్ని రోజులుగా కరోనాతో పోరాడి కన్నుమూశారు. ఇక మరోవైపు శివశంకర్‌ మాస్టర్‌ పెద్దకుమారుడికి కూడా కరోనా పాజిటివ్‌గా తెలింది. దీంతో ఆయనకు కూడా కొంత సీరియస్‌గా ఉందని.. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని తెలుస్తోంది.

  శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ 1948 డిసెంబ‌ర్ 7న త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో జ‌న్మించారు. శివ‌శంక‌ర్ మాస్టర్ తెలుగు, త‌మిళ, కన్నడ, మలయాళీ చిత్రాలకు కొరియోగ్రాఫ‌ర్‌గా పనిచేశారు. శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్రాఫ‌ర్‌గా దాదాపు 800కు పైగా సినిమాల‌కు పనిచేశారు. కొరియోగ్రాఫ‌ర్‌గా 1975లో వ‌చ్చిన త‌మిళ చిత్రం పాట్టు భ‌ర‌త‌మ‌మ్ చిత్రంతో తన కెరీర్‌ను మొదలు పెట్టారు. కొరియోగ్రాఫ‌ర్‌గానే కాకుండా శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ ప‌లు సినిమాల్లోనూ న‌టించారు. తెలుగులో ఆయన ముఖ్యంగా నేనే రాజు నేనే మంత్రి, అక్ష‌ర‌, స‌ర్కార్‌, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, రాజుగారి గ‌ది 3 వంటి దాదాపు 30 సినిమాల్లో న‌టించి మెప్పించారు. శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ ఓ వైపు సినిమాలకు కొరియోగ్రాఫ‌ర్‌గా చేస్తునే తెలుగు డ్యాన్స్ టీవీషోలకు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తూ.. అక్కడ కూడా తన సత్తాను చాటారు.

  Balakrishna | NTR : అఖండ ప్రిరిలీజ్ వేడుకలో ఎన్టీఆర్‌పై బాలయ్య కామెంట్స్.. వీడియో వైరల్..

  రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో (Ram Charan) రామ్ చరణ్, కాజల్ ప్రధాన పాత్రల్లో వ‌చ్చిన మ‌గ‌ధీర (2009) సినిమాలో ధీర ధీర పాట‌కు అందించిన కొరియోగ్ర‌ఫీకి ఆయనకు జాతీయ అవార్డు వరించింది. అంతేకాదు నాలుగుసార్లు త‌మిళ‌నాడు స్టేట్ ఫిలిం అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు. 1996లో పూవే ఉన‌క్క‌గ‌, 2004లో విశ్వ తుల‌సి, 2006లో వ‌ర‌లారు, 2008లో ఉలియిన్ ఓస‌య్ చిత్రాల‌కు అవార్డులు అందుకున్నారు శివ‌శంక‌ర్ మాస్టర్.  కుటుంబం మొత్తం కరోనా బారిన పడడంతో.. పరిశ్రమలో కొందరు ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించారు.  మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 3 లక్షల రూపాయలు తమిళ హీరో ధనుష్ 5 లక్షల రూపాయల అందించగా, సోనూ సూద్ అలాగే మంచు విష్ణు అండగా నిలబడ్డారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా శివ శంకర్ మాస్టర్ ను కాపాడ లేకపోయారు. శివశంకర్ మాస్టర్ సినిమాల్లోనే కాదు.. సీరియల్స్‌లోను నటించారు. నాగ భైరవి, జ్యోతి, నంబర్ వన్ కోడలు వంటి తెలుగు సీరియల్స్‌లో నటించి టీవీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

  శివ శంకర్ మాస్టర్ మరణంతో టాలీవుడ్ ప్రముఖులతో పాటు సామాన్య ప్రేక్షకులు విచారం వ్యక్తం, ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. ఇక ఆయన భౌతికకాయాన్ని రేపు ఉదయం హైదరాబాద్‌ పంచవటిలోని స్వగృహానికి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 2గంటలకు మహాప్రస్థానంలో శివ శంకర్ మాస్టర్ అత్యక్రియలు నిర్వహించనున్నారు.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Chiranjeevi, Rajamouli, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు