నటుడు శివారెడ్డి తెలియని తెలుగు సినీ అభిమానులుండరు. ఆయన తాజాగా.. మీడియాతో మాట్లాడుతూ తనకు అవకాశాలు రాకుండా చేసిన వ్యక్తి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కొంతమంది గ్రూపుగా తయారై.. ఇండస్ట్రీ నుంచి దూరం చేశారన్నారని తెలిపాడు. దీంతో దాదాపు 7 సంవత్సరాలుగా సినిమాలకి దూరంగా ఉన్నానని.. అయితే తానంతట తాను దూరం కాలేదని. కొంతమంది నన్ను దూరం పెట్టారన్నారు. అంతేకాదు నన్ను తొక్కేసిన వ్యక్తులు ఎవరో కూడా తెలుసని.. అయితే ఈ సందర్భంగా వాళ్ల పేర్లు మాత్రం బయటపెట్టలేనన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ 'దూకుడు' సినిమాలో నా పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో నేను చాలా బిజీ అవుతానని చాలామంది అన్నారు. కానీ ఆ తరువాత ఒక్క అవకాశమూ రాలేదు. దీనికి కారణం, నాకు అవకాశాలు రాకుండా చేసింది ఓ స్టార్ కమెడియన్ అన్నారు. అయితే నా అదృష్టం కొద్ది.. సినిమాలను మాత్రమే నమ్ముకుని వుంటే నేను ఈరోజున రోడ్డున పడేవాడిని.. కానీ ప్రైవేట్ ఈవెంట్స్ .. ఇతర స్టేజ్ షోలు, టీవీ షోలు ఆదుకున్నాయని తెలిపారు.
పూలతో కవ్విస్తోన్న అందాల నిధి...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telugu Movie News