Mahesh Babu - Sithara: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గారాలపట్టి సితార. ఇప్పటివరకు ఎటువంటి సినీ పరిచయం లేకుండా సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది ఫాలోయింగ్ ను పెంచుకుంది సితార. నిత్యం తన ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది. అంతేకాకుండా తన తండ్రి మహేష్ బాబు తో కలసి షూటింగ్ సమయంలో పాల్గొన్న విషయాలను కూడా పంచుకుంటుంది. ఇక ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసుకుంది.
View this post on Instagram
అందులో తన నాన్నతో చిన్నప్పటి నుండి కలిసి అల్లరి చేసిన ఫోటోలను వీడియో తో పంచుకోగా తన తండ్రి తనతో ఆడుతూ పాడుతూ ఉంటాడని, డాన్స్ చేస్తుంటాడని, నవ్విస్తాడని, తనను నడిపిస్తాడని.. తన తండ్రి కంటే ఎక్కువగా ఎవరు ప్రేమించరని.. హ్యాపీ ఫాదర్స్ డే అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా మహేష్ అభిమానులు బాగా లైక్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fathers Day 2021, Happy Fathers Day, Instagram, Mahesh Babu, Sithara, Social Media, Tollywood