SITARA ENTERTAINMENTS PRODUCERS PUT CHECK TO RUMOURS ON TRIVIKRAM HERE ARE THE DETAILS SR
Trivikram: త్రివిక్రమ్‌పై వస్తోన్న రూమర్స్‌కు చెక్.. ఆయనకు ఎటువంటి సంబంధం లేదు.. సితార ట్వీట్ వైరల్..
Trivikram srinivas Photo : Twitter
Trivikram: అల్లు అర్జున్ అల వైకుంఠపురములో లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. అది అలా ఉంటే త్రివిక్రమ్‌కి సంబంధించి కొన్ని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram srinivas) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓ వైపు రచయితగా మరోవైపు దర్శకుడిగా టాలీవుడ్ లో టాప్‌లో దూసుకుపోతున్నారు. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అది అలా ఉంటే త్రివిక్రమ్‌కి సంబంధించి కొన్ని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో సితార ఎంటర్టైన్మెంట్స్ తమ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయంపై దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ఇటీవల ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ ట్వీట్ త్రివిక్రమే చేశారని పొరపడిన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి (Perni nani) పేర్ని నాని శుక్రవారం జరిగిన ప్రెస్ మీట్లో ఆ ట్వీట్ గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా త్రివిక్రమ్ ట్వీట్‌ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో సితార ఎంటర్టైన్మెంట్స్ క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఓ ట్వీట్‌ను వదిలిన సితార సంస్థ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసే అన్ని అధికారిక ప్రకటనలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ ట్విటర్ ఖాతాల నుంచి వస్తాయి. ఆయనకు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో ఎటువంటి ఖాతాల్లేవని తెలిపింది. అంతేకాదు ఆయన పేరు, ఫొటోలతో ఉన్న ఖాతాల నుంచి ఎలాంటి స్టేట్మెంట్స్ వచ్చినా దయచేసి అవన్ని నమ్మకండి అంటూ ఏపీ సీఎంవో, ఏపీ మంత్రి పేర్ని నాని ఖాతాలను ట్యాగు చేసింది.
ఇక త్రివిక్రమ్ మాటలు అందిస్తోన్న భీమ్లా నాయక్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ (Bheemla Nayak) ‘భీమ్లా నాయక్’. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అజ్ఞాతవాసి’ తర్వాత మూడేళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ మూవీ ’వకీల్ సాబ్’ తర్వాత పవన్ యాక్ట్ చేస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందిస్తున్నారు. మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది.
He doesn't have any social media presence. Please don't believe in any comments made by various profiles bearing his pic/name.@AndhraPradeshCM@perni_nani@IPR_AP
ఇక ఇప్పటికే విడుదలైన టీజర్స్, పాటలతో కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది. దీంతో ఈ సినిమా బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరుగుతోందని అంటున్నారు. అందులో భాగంగానే భీమ్లా నాయక్ నైజాం హక్కులు 40 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని టాక్ నడుస్తోంది. నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుని జనవరి 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక ప్రమోషన్స్‌లో భాగంగా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా మరో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. లాలా.. బీమ్లా.. అంటూ సాగే సాంగ్‌ను తివిక్రమ్ రాసారు. త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ పాటను విడుదల చేసారు. హీరో పవన్ పాత్ర అయిన భీమ్లా నాయక్‌ను హైలైట్ చేస్తూ సాగే ఈ పాట నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాదాపు 5.04 కోట్ల రూపాయలకు ప్రముఖ సంస్థ (Aditya music) ఆదిత్య మ్యూజిక్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు రానా దగ్గుబాటి (Rana Daggubati) పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. వీరికి జంటగా నిత్య మీనన్, (Nithya menen) సంయుక్త మీనన్ (Samyuktha Menon) నటిస్తున్నారు. రానా దగ్గుబాటి ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.