కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ సారి సినిమా వాళ్ళను పద్మ అవార్డులు కాస్త తక్కువగానే వరించాయి. ముఖ్యంగా రాష్ట్రాలవారీగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి పద్మశ్రీ అవార్డు బహుకరించింది కేంద్రం.
కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ సారి సినిమా వాళ్ళను పద్మ అవార్డులు కాస్త తక్కువగానే వరించాయి. ముఖ్యంగా రాష్ట్రాలవారీగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి పద్మశ్రీ అవార్డు బహుకరించింది కేంద్రం. వేల పాటలు రాసిన ఆయనకు పద్మ అవార్డ్ ఇవ్వడం ఆనందంగా ఉంది అంటున్నారు అభిమానులు. ఈయనకు ఇండస్ట్రీ నుంచి కూడా అభినందనల వెల్లువ మొదలైంది. పద్మభూషణ్ మాత్రం ఈసారి సినిమా వాళ్ళలో ఒక్కరిని మాత్రమే వరించింది. కేరళ రాష్ట్రం నుంచి నటన విభాగంలో మోహన్ లాల్ కు పద్మభూషణ్ ఇచ్చింది కేంద్రం. ఆయన ఒక్కడే ఈసారి పద్మభూషణ్ అందుకుంటున్న సినిమా నటుడు.
పద్మ అవార్డుల పురస్కారం
పద్మశ్రీ పురస్కారాల్లో కర్ణాటక రాష్ట్రం నుంచి డాన్స్ విభాగానికి ప్రభుదేవా పద్మశ్రీ అందుకోనున్నారు. కొన్నేళ్లుగా ఆయన నాట్యంలో సంచలనాలు సృష్టిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాయ్ పెయికు పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్నారు.లెజెండరీ సింగర్ శంకర్ మహదేవన్ కు కూడా పద్మ పురస్కారం దక్కింది. ఈయనకు కూడా పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది కేంద్రం. దివంగత కెనడా నటుడు ఖాదిర్ ఖాన్ కు పద్మశ్రీ ఇచ్చింది కేంద్రం. ఈ మధ్యే అనారోగ్యంతో కన్నుమూశారు ఈయన. చనిపోయిన తర్వాత పురస్కారం దక్కింది. పద్మ అవార్డుల రావడంతో అభినందనల వెల్లువ అన్ని చోట్ల మొదలైంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.