హోమ్ /వార్తలు /సినిమా /

Sirivennala Seetharama Sastry : సీతారామశాస్త్రి మరణంపై ఉప రాష్ట్రపతి, ప్రధాని సహా రాజకీయ, సినీ ప్రముఖులు నివాళి..

Sirivennala Seetharama Sastry : సీతారామశాస్త్రి మరణంపై ఉప రాష్ట్రపతి, ప్రధాని సహా రాజకీయ, సినీ ప్రముఖులు నివాళి..

సీతారామశాస్త్రి మరణంపై ఉప రాష్ట్రపతి,ప్రధాని సహా సినీ,రాజకీయ ప్రముఖుల తీవ్ర సంతాపం (File/Photos)

సీతారామశాస్త్రి మరణంపై ఉప రాష్ట్రపతి,ప్రధాని సహా సినీ,రాజకీయ ప్రముఖుల తీవ్ర సంతాపం (File/Photos)

Sirivennela Seetharama Sastry :  తెలుగు సినీ సాహితీ సౌరభంలో మరో పద్మం రాలిపోయింది. సీతారామశాస్త్రి మరణంతో తెలుగు సినీ సాహిత్య లోకం మూగబోయిందనే చెప్పాలి. సీతారామశాస్త్రి మరణంపై భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, వైయస్ జగన్  సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.

ఇంకా చదవండి ...

Sirivennela Seetharama Sastry :  తెలుగు సినీ సాహితీ సౌరభంలో మరో పద్మం రాలిపోయింది. సీతారామశాస్త్రి మరణంతో తెలుగు సినీ సాహిత్య లోకం మూగబోయిందనే చెప్పాలి. సీతారామశాస్త్రి మరణంపై భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, వైయస్ జగన్  సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ..తెలుగు సినిమా గేయరచయిత శ్రీ చేంబోలు సీతారామశాస్త్రి గారు పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. తొలి సినిమా సిరివెన్నెల పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు భాషకు పట్టం కడుతూ వారు రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో నేను కూడా ఒకణ్ని అంటూ భావోద్వేగానికి గురయ్యారు ఉప రాష్ట్రపతి సంతాపం వ్యక్తం చేశారు.

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి అంటూ ప్రధాని తన సంతాప సందేశం తెలియజేసారు.

అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.ఓం శాంతి . pic.twitter.com/qxUBkJtkYU


— Narendra Modi (@narendramodi) November 30, 2021

ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ శ్రీ చేంబోలు (సిరివెన్నెల) సీతారామశాస్త్రి మరణం పట్ల సీఎం శ్రీ కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, పండిత పామరుల హృదయాలను గెలిచారని సీఎం తెలిపారు.

సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం, సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని అన్నారు. ఆయన మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అటు రెండు రాష్ట్రాల గవర్నళ్లు.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.

తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. మరోవైపు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు

సీతారామశాస్త్రి మరణంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నడిచి వచ్చే నక్షత్రంలా ఆయన స్వర్గ ద్వారాల వైపు సాగిపోయారు. మనకి ఆయన సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి వెళ్లారు. సాహిత్యంలో శ్రీశ్రీ పదును ఆయన కలంలో కనిపిస్తోంది. ప్రజలను మేలు కొలుపే ఎన్నో పాటలను ఆయన అందించారన్నారు.

కలం ఆగిపోయింది, తనతో అద్భుతాలు సృష్టించేవాడు ఏమైయ్యాడని,అక్షరం బెంగపడుతుందన్నారు.


తనను నిప్పుకణాలుగా మార్చేవాడు దూరమైయ్యాడని,సిరివెన్నెల అంటే తెలుగుతనం,సిరివెన్నెల అంటే తెలుగుపదం,

'తెల్లారింది లెగండో' అని నిద్రపోతున్న జాతిని తట్టి లేపాడు, 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని' అని సమాజాన్ని ప్రశ్నించాడు,

'జగమంత కుటుంబం నాది' అని గుండెవిప్పి పాడుకున్నాడు..సిరివెన్నెల గారు భౌతికంగా మనకు దూరమైనా తెలుగు పాటలో ఎల్లప్పుడు బ్రతికే ఉంటార. ఆ మహానుభావుడి పవిత్రాత్మకు శాంతి చేకురాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.అంటూ నందమూరి బాలకృష్ణ తన సంతాపం తెలియజేసారు.

అటు మోహన్ బాబు,  పవన్ కళ్యాణ్, నాగార్జున, వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్, నాగబాబు, నిహారకి సహా పలువరు  కూడా సీతారామశాస్త్రి మరణంపై తీవ్ర సంతాపం తెలియజేసారు.తెలుగులో శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, దాశరథి సముద్రాల, కొసరాజు, వేటూరి తర్వాత  ఆ స్థాయి సినీ గేయ రచయతగా తన కంటూ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.  ప్రస్తుతం తెలుగులో ఏదైనా ప్రత్యేక పాట రాయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఈయనే. కా సీతారామశాస్త్రి పాటలతో తెలుగు సినిమా పునీతమైందనే చెప్పాలి. ఈయన పాటలతో తెలుగు సినీ పరిశ్రమ కొత్త పుంతలు తొక్కింది.  ఏదేమైనా సిరివెన్నెల  మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరిని లోటు అని చెప్పాలి.

First published:

Tags: Ap cm ys jagan mohan reddy, Balakrishna, Chiranjeevi, CM KCR, PM Narendra Modi, Sirivennela Seetharama Sastry, Tollywood, Trivikram Srinivas, Vice President of India

ఉత్తమ కథలు