Home /News /movies /

Sirivennela Seetharama Sastry - Trivikram : సీతారామశాస్త్రి అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు.. వైరల్ అవుతున్న సిరివెన్నెలపై త్రివిక్రమ్ స్పీచ్..

Sirivennela Seetharama Sastry - Trivikram : సీతారామశాస్త్రి అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు.. వైరల్ అవుతున్న సిరివెన్నెలపై త్రివిక్రమ్ స్పీచ్..

సిరివెన్నెల పై త్రివిక్రమ్ సూపర్ స్పీచ్ (File/Photo)

సిరివెన్నెల పై త్రివిక్రమ్ సూపర్ స్పీచ్ (File/Photo)

Sirivennela Seetharama Sastry - Trivikram : సీతారామశాస్త్రి అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు.. వైరల్ అవుతున్న శాస్త్రిపై త్రివిక్రమ్ పాత స్పీచ్.. ఈయన గురించి కొత్తగా త్రివిక్రమ్ 2012లో మా మ్యాజిక్ అవార్డ్స్ ఫంక్షన్‌లో చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.

ఇంకా చదవండి ...
  Sirivennela Seetharama Sastry - Trivikram : సీతారామశాస్త్రి అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు.. వైరల్ అవుతున్న శాస్త్రిపై త్రివిక్రమ్ పాత స్పీచ్.. కొందరి గురించి తెలియాలంటే వాళ్లు పోయిన తర్వాత తెలుస్తోంది. అది సీతారామశాస్త్రి అస్తమయంతో మరోసారి ఋజువైంది. పోయినోళ్లు మంచోళ్ళా కాదా అంటే.. ఆ వ్యక్తి పట్ల మనకున్న ఇష్టం, ప్రేమ, గౌరవం, ఆరాధన...ఇవే కొలమానాలు. ఈ కొలమానాలకు అన్నివిధాల సరితూగే సినీ పాటల రచయిత సిరివెన్నెల. ఈయన గురించి కొత్తగా త్రివిక్రమ్ 2012లో మా మ్యాజిక్ అవార్డ్స్ ఫంక్షన్‌లో చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. సీతారామశాస్త్రి సాహిత్యం గురించి చెప్పడానికి నా శక్తి సరిపోదు. నా కున్న ఒకాబులరీ సరిపోదున్నారు. సిరివెన్నెల పాటలు విన్నాకే తెలుగు డిక్షనర.. శబ్ధ రత్నాకరం ఒకటి ఉంటుందనే విషయం అపుడే తనకు తెలిసిందన్నారు. ఆయన పాటలోని సాహిత్యాన్ని శబ్ధ రత్నాకరం చూసి తెలుసుకున్నాను.

  ప్రేక్షకులకు అర్ధమయ్య పాటలే కాదు.. అర్ధం చేసుకోవాలనే కోరికను పుట్టించే పాటలు రాయోచ్చని ఆ తర్వాతే తనకు అనిపించందన్నారు మాటల మాంత్రికుడు. తెలుగు సినీ సాహితీ స్థాయిని పెంచిన వ్యక్తి సీతారామశాస్త్రి. ప్రేక్షకులు స్థాయిని పెంచిన కవి సీతారామశాస్త్రి.

  సీతారామశాస్త్రి (File/Photo)


  మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘రుద్రవీణ’లో ‘తరలి రాదా తనే వసంతం’.. తన దరికి రాని వనాల కోసం’ అనే మాటలు పాటలో రాయడానికి డైరెక్టర్‌ బాలచందర్ గారిని, నిర్మాతైన నాగబాబును ఒప్పించడానికి సీతారామశాస్త్రి గారికి ఎన్నో గట్స్ ఉండాలో దర్శకుడిగా నాకు తెలుసు. అందుకే ఆయన పాదాలకు నమస్కారం పెడుతున్నా.

  Sirivennela Seetharama Sastry : సినీ గేయ రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత.. ప్రముఖుల నివాళి..

  హీరోల ఇమేజ్, దర్శకుల అర్ధం లేని తనం, నిర్మాత వ్యాపార విలువలు ప్రేక్షకులను అలరించడానికి ఆయన ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపిన సందర్భాలున్నాయి. రాత్రిళ్లు ఆయన ఖర్చు చేసుకున్న జీవితం.. ఆయన ఒదులుకున్న కుటుంబం.. ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోయారు. ఇక ప్రపంచం పడుకున్నాకా ఆయన లేస్తారు. ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు. ఆయన పదాలనే కిరణాలు తీసుకొని.. అక్షరాలు అనే తూటాలతో ప్రపంచం మీద వేటాడానికి బయలు దేరుతారు.

  Sirivennela Seetharama Sastry : కళా తపస్వీ విశ్వనాథ్‌తో సీతారామశాస్త్రి ప్రత్యేక అనుబంధం..


  మనం ఆన్సర్ చెప్పలేని ఎన్నో క్వశ్వన్స్‌ను ఆయన పాటల రూపంలో సంధిస్తారు. ఆయన తన పాటలతో ఎపుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఓటమిని ఎపుడు ఒప్పుకోవద్దంటారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ లక్డీకాపూల్ అమరావతి థియేటర్‌లో సింధూరం సినిమా చూశాను.సినిమా మొత్తం చూశాను. ఏదో అసంతృప్తి. ఆ చివర్లో అర్ధ శతాబ్ధపు అజ్ఞానాన్ని స్వతంత్ర మందమా అనే పాటలలోని మాటతో రెండు చేతులు జేబులో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్లిపోయాను. ఆ సమయంలో తాను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియలేదు.

  Sirivennala Seetharama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రికి పేరు తీసుకొచ్చిన చిత్రాలు..

  ఒక మనిషిని ఇంతలా కదిలించగల శక్తి సాహిత్యానికి, అక్షరానికి మాత్రమే ఉంటుంది. ఆయన తెలుగు సినిమా కవి అవ్వడం మూలానా.. ఇక్కడే మిగిలిపోయాడేనని బాధగా ఉందన్నారు. సినిమా పాటలకు మన దగ్గర అసలు విలువ లేదు. దాశరథి, సముద్రాల,శ్రీశ్రీ  చాలా మంది కవులు సినిమాలకు పాటలు రాయడం మూలానా ఎందకు పనిరాకుండా పోయారన్నారు. గొప్ప కవులంతా సినిమాలకు పాటలు రాయడం వాళ్ల దురదృష్టం అన్నారు. తెలుగు సినిమాతో సీతారామశాస్త్రి కంటే.. తెలుగు సినిమానే బాగుపడిందంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. అప్పట్లో త్రివిక్రమ్.. సీతారామశాస్త్రి గురించి చెప్పిన మాటలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.

  Sirivennela Seetharama Sastry,Sirivennela Seetharama Sastry death,Sirivennela Seetharama Sastry passed away,stars who gets famous with debut movies,dil raju debut movie,allari naresh debut movie,vennela kishore debut movie,sirivennela debut movie,devi sri prasad debut movie,సినిమా పేర్లే ఇంటి పేర్లు,దిల్ రాజు,వెన్నెల కిషోర్,సిరివెన్నెల సీతారామశాస్త్రి
  సీతారామశాస్త్రి (File/Photo)


  త్రివిక్రమ్ .. సీతారామశాస్త్రి సోదరుడి కూతురిని పెళ్లి చేసుకున్నారు. త్రివిక్రమ్ ప్రతిభ, మంచితనం గురించి తెలుసుకున్న ఆయన తన తమ్ముడి కూతురు సౌజన్యను పెళ్లి చేసుకున్నారు. అయితే.. ముందుగా అక్కను చూసిన త్రివిక్రమ్.. అక్కడే చెల్లెలును చూసి ఇష్టపడ్డారు. అలా నాటకీయంగా త్రివిక్రమ్ పెళ్లి సీతారామశాస్త్రి తమ్ముడు కూతురు సౌజన్యతో జరిగింది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Sirivennela Seetharama Sastry, Tollywood, Trivikram Srinivas

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు