Sirivennela Seetharama Sastry - RGV : సీతారామశాస్త్రి.. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వ పడే పాటల రచయతల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రికి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో వేల పాటలు రాసిన ఈయనకు పలువురు దర్శకులు, హీరోలతో ప్రత్యేక అనుబంధం ఉంది. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు కళా తపస్వీ కే.విశ్వనాథ్‌తో ఈయనకు విడదీయరాని అనుబంధం ఉంది. అటు తన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రామ్ గోపాల్ వర్మకు సీతారామశాస్త్రి అంటే ప్రత్యేక అభిమానం ఉంది. ఆయన తొలి చిత్రం ‘శివ’లో అన్ని పాటలు సీతారామశాస్త్రితో రాయించారు. ముఖ్యంగా సిరివెన్నెల, రుద్రవీణ, శృతిలయలు, స్వర్ణకమలం వంటి చిత్రాల్లో సంప్రదాయ చంధోబద్దమైన ఎన్నో గీతాలను అలవోకగా రాసారు.
అలాంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి రామ్ గోపాల్ వర్మ తొలిసారి మెగాఫోన్ పట్టుకొని నాగార్జున హీరోగా తెరకెక్కించిన ‘శివ’ సినిమా కోసం బోటని పాఠముంది.. మ్యాటనీ ఆట వుంది అంటూ సీతారామశాస్త్రి రాసిన పాట అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాతా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ప్రతి చిత్రంలోసీతారామశాస్త్రితో పాటలు రాయించుకోవడం మాత్రం మానలేదు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ .. సీతారామశాస్త్రి తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ముఖ్యంగా క్షణ క్షణంలో వెంకటేష్. శ్రీదేవిలపై చిత్రీ కరించిన ‘అమ్మాయి ముద్దు ఇమ్మందే ఈ రేయి తెల్లవారలేదంతే’ పాటను గుర్తు చేసుకున్నారు. ఆయన చనిపోవడం బాధకరమన్నారు. మనతో పాటు అందరు ఎపుడో ఒకప్పుడు పోవాల్సిందే. ఆయన రాబోయే తరం కవులకు ఎంతో మంది ఇన్‌స్ప్రేషన్‌గా నిలిచారన్నారు.
Sirivennala Seetharama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రికి పేరు తీసుకొచ్చిన చిత్రాలు..
సాహసం నా రథం... సాహసం జీవితం.,. సాగితే ఆపడం సాధ్యమా అంటూ సీతారామశాస్త్రి రాసిన ఈ పాట నాకు ప్రేరణగా నిలిచిందన్నారు. అంతేకాదు మీరు తప్పకుండా స్వర్గానికి పోతారు.. నేను మాత్రమే నరకానికి పోతాను. ఒకవేళ ఏదో తెలియక స్వర్గానికి వచ్చి ఉంటే.. అక్కడ వోడ్కా మీరు నాతో తాగరు. కానీ మనిద్దరం కలిసి అమృతం తాగుదామంటూ వాయిస్ రికార్డు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
— Ram Gopal Varma (@RGVzoomin) November 30, 2021
ఇక రామ్ గోపాల్ వర్మ.. ప్రోద్బలంతోనే ‘గాయం’ సినిమాలో నటించారు. అంతేకాదు తాను రాసిన ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని.. అగ్గితోని కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని అంటూ ఆయన పాటలో నటించడంతో పాటు రాసారు.
Sitarama Shastry Garu pic.twitter.com/QfC7Gjakvc
— Ram Gopal Varma (@RGVzoomin) November 30, 2021
ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అంతం’తో పాటు ఆయన నిర్మాణంలో తెరెక్కిన ‘మనీ’ ‘మనీ మనీ’ సినిమాలతో పాటు పలు చిత్రాల్లో సిరివెన్నెల పాటలు రాయడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ram Gopal Varma, RGV, Sirivennela Seetharama Sastry, Telugu Cinema, Tollywood